అమరావతిని ఇప్పటికే కొంత మంది ఎడారి అని, శ్మశానం అంటూ, మునక ప్రాంతమని తప్పుడు ప్రచారాలు చేశారని... అమరావతి ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ సుధాకర్ పేర్కొన్నారు. ఎన్జీఆర్ఐ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా భూకంపం వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా.. అభివృద్ధి పేరుతో 3 వేల కోట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సుధాకర్ చెప్పారు. విస్ఫోటనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధానిలో ముందు ఏ పనులు ప్రారంభిస్తున్నారు? ఏఎంఆర్డీఏ పేరుతో సీఆర్డీఏ నిధులు ఏ విధంగా సేకరిస్తున్నారో రాజధానిలో సహ భాగస్తులమైన తమకు తెలిపాలని కమిషనర్ ను కోరారు. వారంలో దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని లేకపోతే రాజధాని గ్రామాల్లోని 29 వేల మంది ప్రజలు సీఆర్డీయే కార్యాలయం దగ్గరికి వస్తామని సుధాకర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు: చంద్రబాబు, లోకేశ్