ETV Bharat / city

Land rates: 'భూముల రిజిస్ట్రేషన్​ విలువలను సవరించండి'

author img

By

Published : Jun 30, 2021, 11:01 AM IST

తెలంగాణ రాష్ట్రంలో భూములు-ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ధరలు ఏడు మార్లు పెంచారని.. మహారాష్ట్ర, తమిళనాడులోనూ రాష్ట్రంతో పోలిస్తే ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న భూముల విలువల సవరణ చేపట్టాలని నిర్ణయించిన సబ్ కమిటీ.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు నివేదిక అందించనుంది.

Land rates
Land rates

నిధుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మరోదఫా సమావేశమైంది. హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు, రహదార్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు శాఖల అధికారులు పాల్గొన్నారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించిన ఉపసంఘం.. భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణ పెద్దఎత్తున అభివృద్ధి సాధిస్తోందని, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా భూముల విలువ భారీగా పెరిగిందని అధికారులు వివరించారు.

భూముల విలువ పెరిగింది..

సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చి నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిందని తెలిపారు. భూముల విలువ భారీగా పెరిగినప్పటికీ గత ఎనిమిదేళ్లుగా రిజిస్ట్రేషన్ విలువల్లో ఎలాంటి పెంపుదలా లేదని చెప్పారు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని అధికారులు అన్నారు. ఎక్కువ ధరలకు కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ చాలా మంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి లావాదేవీలతో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు భూముల విలువలను సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఏపీ 7సార్లు..

ఇదే చట్టం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో ఏడుసార్లు భూములు విలువలను సవరించిందని... రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచిందని సమావేశంలో చర్చ జరిగింది. తమిళనాడులో ఏడున్నరశాతం, మహారాష్ట్రలో ఏడు శాతం రిజిస్ట్రేషన్ రుసుము ఉందని అధికారులు మంత్రులకు తెలిపారు. రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ప్రధాన వాటా కలిగిన హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలోని భూములు, ఆస్తుల విలువలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు, భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, నగర విస్తరణతో రియల్ బూమ్ వచ్చిందని అన్నారు. 2019 - 20 సంవత్సరంలో హెచ్ఎండీఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సుమారు 51 శాతం లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి రిజిస్ట్రేషన్లు అయినట్లు అధికారులు ఉపసంఘానికి వివరించారు.

ధరలను సవరించాలని..

ప్రభుత్వ నిర్ధారిత విలువ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా ఉండటంతో భూములు, ఇండ్లు కొనుగోలు చేసే ప్రజలకు బ్యాంకు రుణాలు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వీటిని తొలగించేందుకు పెరిగిన విలువకు అనుగుణంగా ధరలను సవరించాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. వీటన్నింటి నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుము సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి ఉపసంఘం వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఇందుకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయించింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.