తాను వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు చెప్పారు. ఏపీ సచివాలయంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పంచాయతీ ల్లో తాగునీటి సరఫరాతోపాటు పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేలా కార్యాచరణ చేపడతామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినా పాత జిల్లా పరిషత్లు పదవీకాలం పూర్తి అయ్యే వరకూ కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు. పంచాయతీల్లో రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు 1,072 కోట్ల రూపాయలతో త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు.. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్