ETV Bharat / city

తెలుగు-సంస్కృత అకాడమీపై ప్రజాభిప్రాయం శిరోధార్యం - telugu academy peru marpu

తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయాన్ని శిరోధార్యంగా భావించి పునఃపరిశీలించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ప్రభుత్వానికి సూచించారు. దీనిపై సీఎం జగన్‌కు గురువారం లేఖ రాశారు. ‘తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేయడాన్ని తెలుగు జాతి మొత్తం వ్యతిరేకిస్తున్న అంశాన్ని సీఎం దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాసానని మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు.

budha prasad letter
తెలుగు-సంస్కృత అకాడమీపై ప్రజాభిప్రాయం శిరోధార్యం
author img

By

Published : Jul 16, 2021, 7:49 AM IST

ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం శిరోధార్యంగా భావించి పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీని కోసం మండలి బుద్ధప్రసాద్‌ సీఎం జగన్​కు లేఖ రాశారు. తెలుగు అకాడమీని తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేయడాన్ని తెలుగు జాతి మొత్తం వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నా...అంటూ లేఖలో రాశారు.

తెలుగు-సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్‌,అధికారభాషా సంఘం అధ్యక్షుడు మినహా అందరు వ్యతిరేఖిస్తున్నారని గుర్తు చేశారు.అన్ని రాజకీయ పార్టీలు, పత్రిక, ప్రసార, సామాజిక మాధ్యమాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయని.ప్రజాభిప్రాయాన్ని గమనించడానికి ఇంతకంటే వేరే మార్గం ఏముంది? అంటూ లేఖలో రాశారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నపుడు వాటిని వెనక్కి తీసుకుంటేనే ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందని బుద్ధప్రసాద్ అన్నారు.

ఎక్కువ నిధులతో మరింత సమర్థంగా పనిచేసేలా చేసి తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.అకాడమీ విభజన త్వరగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్​కు రావాల్సిన దాదాపు రూ.200 కోట్లు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని బుద్ధప్రసాద్​ కోరారు..సంస్కృత భాషను ఎవరూ వ్యతిరేకించడం లేదని... అవసరం అయితే సంస్కృత భాషకు ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రజాభిప్రాయం వ్యక్తమైందని దీన్ని ప్రభుత్వం గమనించాలని మండలి బుద్ధప్రసాద్​ సూచించారు.

ఇది చదవండి :

WATER DISPUTES: తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.