ETV Bharat / city

పరీక్షలపై అస్పష్టత.. ఇంజినీరింగ్​ విద్యార్థుల ఇబ్బందులు

కరోనా వ్యాప్తితో విద్యా సంవత్సరం క్యాలెండర్‌ అమలు అనూహ్యంగా నిలిచిపోయింది. ఇంజినీరింగ్‌ చివరి ఏడాది పరీక్షలు వాయిదా పడడంతో... ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో కొందరు చివరి సెమిస్టర్‌ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని సంస్థల ప్రతినిధులు... ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో ఎప్పుడు చేరతారని అగుడుతున్నట్లు కళాశాలల యాజమాన్యం తెలిపింది. అసలు ఉద్యోగాలు ఇస్తారో లేదో అన్న భయం విద్యార్థులకు పట్టుకుంది.

b.tech students problems joining in jobs
ఉద్యోగాల్లో ఎప్పుడు చేరతారని చేసుకున్న కంపెనీల వాకబు
author img

By

Published : Jul 7, 2020, 9:31 AM IST

కొవిడ్‌ విజృంభణతో విద్యా సంవత్సరం క్యాలండర్‌ అమలు అనూహ్యంగా నిలిచిపోయి, ఇంజినీరింగ్‌ చివరి ఏడాది పరీక్షలు వాయిదా పడడంతో... ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థుల్లో కొందరు చివరి సెమిస్టర్‌ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా కొన్ని కంపెనీలు విద్యార్హత ధ్రువపత్రాలు అడుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ కంపెనీలు ఏడో సెమిస్టర్‌ వరకు ఉన్న ధ్రువపత్రాల ఆధారంగానే ఇంటర్న్‌షిప్‌ కింద ఆన్‌లైన్‌ శిక్షణ అందిస్తున్నాయి. ఇంటి నుంచే కోర్సులపై శిక్షణ సైతం ప్రారంభించాయి. మిగిలిన సంస్థల ప్రతినిధులు... ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో ఎప్పుడు చేరతారని తమకు ఫోన్లు చేసి అడుతున్నారని ఆర్‌వీఆర్‌, జేసీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణ నియామక అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని కంపెనీలు... పరీక్షలు, అకడమిక్‌ క్యాలండర్‌ వివరాలు ఏమైనా ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని... ప్రాంగణ నియామక అధికారులకు ఆన్‌లైన్‌ లింకులు పంపించాయి. వివరాలను నమోదు చేసే క్రమంలో ఇంజినీరింగ్‌ పూర్తి ఎప్పుడు అనే కాలమ్‌ నింపాల్సి వస్తోందని, దీంతో ఏదో అంచనాతో వేస్తున్నామని ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన... చిత్తూరు జిల్లాలోని ఇంజినీరింగ్‌కు కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని తెలిపారు.

షెడ్యూల్‌ కోసం నిరీక్షణ

అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్టుగ్రాడ్యుయేషన్‌ పరీక్షల నిర్వహణపై విశ్వవిద్యాలయా నిధుల సంఘం(యూజీసీ) స్పష్టత ఇచ్చినందున రాష్ట్రంలో ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది. తాజాగా చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు సెప్టెంబరు పూర్తయ్యేలోపు విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించాలనీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించిన నేపథ్యంలో దీనిపైనా అధికారులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల వర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యా మండలి నిర్వహించిన సమావేశంలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కష్టమనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఎంపికైన వారందరికీ ఉద్యోగాలు

తాము ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసుకున్న అందరికీ ఆన్‌ బోర్డింగ్‌(నేరుగా నియామకాలు) ఇస్తామని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నీ ప్రకటించాయి. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ రాగానే కొన్ని కంపెనీలు చేరికల తేదీలను ప్రకటిస్తాయి. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. కంపెనీలు ఇస్తున్న ఆన్‌లైన్‌ శిక్షణ పూర్తిచేసి, సిద్ధంగా ఉండాలి. ప్రస్తుత సమయాన్ని సామర్థ్యాల మెరుగుకు వినియోగించుకోవాలి.

-కోట సాయికృష్ణ, గౌరవాధ్యక్షులు, ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.