తెలంగాణలోని హనుమకొండలో బీఎస్పీ వరంగల్ ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. 2023 లో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని... ప్రగతి భవన్ పేరును బహుజన భవన్‌గా మారుస్తామన్నారు.
గ్రామ గ్రామాన ఏనుగు గుర్తు, నీలిజెండా ఎగరాలన్నారు. మిగతా పార్టీల్లో ఉన్న నేతలను ఆహ్వానించాలని సూచించారు. తమకు లక్షల కోట్లు బాకీ ఉంటే... రూ. పదిలక్షల పరిహారంగా ఇస్తున్నారన్నారు.
మా రక్తంలో మాట తప్పే, మడమ తిప్పే లక్షణం లేదు, మేం అంబేడ్కర్, కాన్షీరాం వారసులం. ఏనుగు గుర్తును గెలిపించాలని బహుజన దేవతలకు మొక్కాలి. రాజ్యాంగం రాసిందే మా తాత అంబేడ్కర్. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, ఎస్టీ బిడ్డలే పాలకులు. బానిసలవుతారా.. పాలకులవుతారా.. తేల్చుకోవాలి -ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త
ఇదీ చూడండి:
ASSEMBLY SESSIONS: సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు