మాంజా బలంగా ఉండడం వలన చిన్నారికి తీవ్రగాయమైందని... చికిత్స చేసినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. చిన్నారి అభినేశ్వర్ ఆసుపత్రిలో కన్ను మూశాడు. గోపాల్ ఫిర్యాదు మేరకు చెన్నై ఆర్కేనగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఘటనకు సంబంధించి కొరుకుపేట ప్రాంతంలో ఇంజినీరింగ్ విద్యార్థి నాగరాజ్, పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. దారానికి మాంజా అనే మిశ్రమాన్ని దట్టించి ఎండబెడతారని అందువల్ల దారం తొందరగా తెగిపోదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఇదీ చదవండి :
అభ్యర్థులు టవరెక్కింది సిగ్నల్ కోసం కాదు... ఉద్యోగం కోసం..