కొందరు రాజధాని రైతులు తన దగ్గరకు వచ్చారని, కొన్ని సమస్యలు చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అసలు అసైనీలకు కాకుండా వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవోను సవరించాలని రైతులు కోరారన్నారు. ఇంకా ఎవరైనా రాజధాని రైతులు తమ వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇదే చివరి సమావేశమని చెప్పలేమన్న బొత్స..., అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల తరలింపు అంశాన్నీ పరిశీలిస్తున్నామని వెల్లడించారు. జిల్లాల వారీ అభివృద్ధి అనేది తమ ప్రభుత్వ అజెండా అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
'రైతులు నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పారు'
కొందరు రాజధాని రైతులు తన దగ్గరకు వచ్చారని, కొన్ని సమస్యలు చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అసలు అసైనీలకు కాకుండా వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవోను సవరించాలని రైతులు కోరారన్నారు.