ETV Bharat / city

తెలంగాణ: బోరు మంటున్న చిన్నారుల ప్రాణాలు!

బోరుబావుల్లో ప్రమాదవశాత్తు చిన్నారులు పడుతున్న ఘటనలు తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లాలో రెండు ప్రాంతాల్లో బోరుబావుల్లో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మెదక్‌ జిల్లాలో బోరుబావిలో సాయివర్ధన్‌ అనే చిన్నారి పడిన ఘటన నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో బోరుబావుల విషయంలో మరోసారి ఆందోళన నెలకొంది.

telengana
తెలంగాణలో బోరు బావిల్లో చిన్నారుల మృతి!
author img

By

Published : May 28, 2020, 2:22 PM IST

Updated : May 28, 2020, 6:34 PM IST

అది 2017 జూన్‌ 22 సాయంత్రం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి వద్ద 18 నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడింది. 60 గంటలపాటు అధికార యంత్రాంగం శ్రమించి చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. తొలుత 40 అడుగులు, తర్వాత 180 అడుగులు.. జారుకుంటూ 400 అడుగుల లోతుకు వెళ్లిన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

  • 2014 అక్టోబరు 13.. మంచాలలో నాలుగేళ్ల చిన్నారి గిరిజ ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయింది. బోరుకు సమాంతరంగా సొరంగం తవ్వేందుకు ప్రయత్నించి అధికారులు 41 అడుగుల వద్ద బండరాయి రావడంతో పగులగొట్టుకుంటూ వెళ్లారు. మరుసటి రోజుకు 45 అడుగుల వద్ద చిన్నారి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.

బోరుబావుల్లో ప్రమాదవశాత్తు చిన్నారులు పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో చేవెళ్ల, మంచాలలో జరిగిన ఘటనలు బోరుబావుల పట్ల రైతులు, బోర్ల యజమానుల నిర్లక్ష్యాన్ని తెలియజేశాయి. తాజాగా మెదక్‌ జిల్లాలో బోరుబావిలో సాయివర్ధన్‌ అనే చిన్నారి పడిన ఘటన నేపథ్యంలో బోరుబావుల విషయంలో మరోసారి ఆందోళన నెలకొంది.

నిరుపయోగంగా మారుతున్నాయ్‌!

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 85 వేల బోరుబావులు ఉన్నాయని అధికారుల అంచనా. గతంలో బోరుబావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనల సందర్భంలో ప్రభుత్వాలు స్పందించి నిరుపయోగంగా ఉన్న వాటిని మూసివేయాలని ఆదేశించింది. అయినప్పటికీ చాలాచోట్ల బోరు వేసి నీరు పడలేదని వెంటనే పూడ్చకుండా వదిలేస్తున్న పరిస్థితి. ఏళ్ల తరబడి వినియోగించిన తర్వాత నీరు రాకపోవడంతో ఆ బోరును అలాగే వదిలేసి మరో బోరు వేస్తున్నారు. దీనివల్ల పాతబోరు నిరుపయోగంగా మారి నోరు తెరిచి ప్రమాదకరంగా మారుతోంది.

రంగారెడ్డి జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 1049 బోరుబావులు నిరుపయోగంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటిని పూడ్చివేశామని చెబుతున్నా.. కొత్తగా వేస్తున్న వాటి విషయంలో పర్యవేక్షణ కొరవడుతోంది. బోరును తవ్విన తర్వాత వెంటనే పూడ్చివేయాలి. వాస్తవానికి బోరు వేసే ముందే అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ విషయాన్ని పట్టించుకోకుండానే అధిక సంఖ్యలో బోర్లు వేస్తున్న పరిస్థితి. ‘‘రంగారెడ్డి జిల్లాలో గత పదేళ్లు బోరుబావుల సంఖ్య తగ్గుతోంది. ఏదైనా బోరు వేసి నీరు పడకపోతే వెంటనే దాన్ని పూడ్చివేయాలని చెబుతున్నాం. ఆ బాధ్యత రిగ్‌ యజమానులే తీసుకోవాల్సి ఉంటుంది’’ అని జిల్లా భూగర్భ జల వనరుల శాఖ చంద్రారెడ్డి తెలిపారు.

ఆక్సిజన్‌ సరఫరా కీలకం

బోరుబావిలో చిన్నారి పడితే ముందుగా ఆ ప్రాంతాన్ని స్కానర్లతో గుర్తించాలి. చిన్నారికి అవసరమైన జీవ వాతావరణం కల్పించాలి. ఆక్సిజన్‌ సరఫరా చేస్తుండాలి. ఉష్ణోగ్రత, తేమను తక్కువ చేస్తుండాలి. చిన్నారి ఉన్న ప్రాంతాన్ని గుర్తించాక బోరు అలైన్‌మెంట్‌ తెలుస్తుంది. దాని ప్రకారం సమాంతరంగా బోరులోకి మట్టి పడకుండా కేసింగ్‌ పంపిస్తూ రెండు వైపులా మీటరు చొప్పున తవ్వుకుంటూ వెళ్లాలి.

- లక్ష్మణరావు, జేఎన్‌టీయూ ఆచార్యుడు

-

ఇదీ చదవండి:

లాక్​డౌన్​ 5.0: ఈ నగరాలకే పరిమితం!

Last Updated : May 28, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.