ETV Bharat / city

ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పని లేదు: సోనూసూద్

ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పనిలేదని ప్రముఖ సినీనటుడు సోనూసూద్ స్పష్టం చేశారు. లాక్​డౌన్ నుంచి నిరంతరంగా ప్రజలకు దగ్గరగా ఉంటున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్​లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.

bollywood actor sonu sood
ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పని లేదు: సోనూసూద్
author img

By

Published : Feb 15, 2021, 8:17 PM IST

ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పని లేదు: సోనూసూద్

కొవిడ్ సమయంలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న తనకు రాజకీయవేత్తలు ఫోన్ చేసి అభినందించారని ప్రముఖ సినీనటుడు సోనూసూద్ తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. నటుడిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ఎల్బీనగర్​లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న సోనూ.. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పని లేదని స్పష్టం చేశారు. లాక్​డౌన్ నుంచి నిరంతరం ప్రజలకు దగ్గరగానే ఉంటున్నానని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతోమంది నిరుపేదలు వైద్యం కోసం తనను సంప్రదించేవారని, వారి ఆర్థిక కష్టాలు తెలుసుకుని తన స్నేహితుడు, అంకు ఆస్పత్రి వ్యవస్థాపకుడు ఉన్నం క్రిష్ణప్రసాద్ సాయం చేశాడని తెలిపారు. తను పనిచేస్తున్న దర్శకులు కూడా ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి :

ఎన్టీఆర్ ట్రస్టుకు 24 ఏళ్లు పూర్తి.. చంద్రబాబు, లోకేశ్​ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.