ETV Bharat / city

Black fungus: తెలంగాణలో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత - బ్లాక్​ ఫంగస్ బాధితులు

తెలంగాణలో బ్లాక్‌ ఫంగస్‌ (Black fungus) బాధితులను ఇంజక్షన్ల కొరత వేధిస్తోంది. దీంతో కోర్సు పూర్తిగా ఇవ్వకుండానే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇళ్లకు పంపించేస్తున్నాయి. ఇలా వెళ్లిన పలువురు పదిహేను రోజుల్లోనే మళ్లీ వైద్యశాలకు పరుగు తీయాల్సి వస్తోంది. ఈ వ్యాధి చికిత్సలో ప్రధానంగా వాడే ఆంఫొటెరిసిన్‌-బి(Amphotericin-b) ఇంజక్షన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదని వైద్యులు చెబుతున్నారు.

black fungus
black fungus
author img

By

Published : Jun 5, 2021, 7:17 PM IST

బ్లాక్​ ఫంగస్ (Black fungus) చికిత్స కోసం ఉపయోగించే ఇంజక్షన్లు కేంద్రం నుంచి సరిపడా అందకనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారిలో వేలాదిమంది బ్లాక్‌ ఫంగస్‌(Black Fungus) బారినపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి కంటి ఆసుపత్రుల్లో 500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో మరికొంతమంది చేరారు. ఈ వ్యాధి చికిత్సలో ప్రధానంగా లైపొసోమల్‌ ఆంఫొటెరిసిన్‌-బి(Amphotericin-b) ఇంజక్షన్లు వాడుతున్నారు.

ప్రస్తుతం బ్లాక్‌ ఫంగస్‌ (Black fungus) బాధితులకు శరీర బరువును అనుసరించి రోజూ 3-5 మిల్లీ గ్రాముల సూది మందును మూడు నెలలపాటు రోజూ ఇవ్వాలని సరోజినీదేవి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒక వయల్‌లో 50 మిల్లీ గ్రాములు ఉంటుంది. ప్రతి బాధితునికి సగటున రోజుకు 3 మి.గ్రా. ఇచ్చినా 90 రోజులకు 270 ఇంజక్షన్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వమే వాటిని ఉత్పత్తి సంస్థల నుంచి సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. అవసరం మేరకు సరఫరా కాకపోవడంతో గాంధీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి కంటి ఆసుపత్రుల్లో ఉన్న రోగులందరికీ పూర్తి కోర్సుకు సరిపడా ఇంజక్షన్లు ఇవ్వలేకపోతున్నారు. కొందరికి 3 రోజులు, మరికొందరికి 5 రోజులు, ఇంకొందరికి వారంపాటు ఇచ్చి ఇళ్లకు పంపేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా పొసకొనజోల్‌ గోలీలు (100 మి.గ్రా.) మూడు వారాలకు సరిపడా ఇచ్చి పంపుతున్నారు.

ఉన్నవాటినే సరిపెడుతున్నాం

రోగి పరిస్థితిని బట్టి 5-7 రోజులపాటు ఆంఫొటెరిసిన్‌-బి ఇంజక్షన్లు ఇస్తున్నామని, ఆ తరువాత పొసకొనజోల్‌ గోలీలు మూడు వారాలకు సరిపడా ఇచ్చి పంపిస్తున్నామని సరోజినీదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం తెలిపారు. ఈఎన్‌టీ, గాంధీలోనూ ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారన్నారు. ఉన్న కొద్ది ఇంజక్షన్లను అందరికీ సరిపెట్టేలా ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.

నల్ల బజారులో రూ.30,000

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆంఫొటెరిసిన్‌-బి ఇంజక్షన్లు అసలు అందుబాటులో ఉండటం లేదు. అక్కడి బాధితులు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మూడు లేదా అయిదు రోజులకు సరిపడా పంపిస్తున్నారు. దీంతో పలువురు బాధితులు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చి గాంధీ, ఈఎన్‌టీ దవాఖానాల్లో చేరుతున్నారు. రోగులు పెరిగిపోవడంతో ఇక్కడా మందుల కొరత ఏర్పడుతోంది. అరకొరగా మూడు రోజులపాటు సూదిమందు ఇచ్చి ఇళ్లకు పంపేస్తున్నారు. దీంతో చాలామందిలో వ్యాధి తిరగబెడుతోందని, కంటి నుంచి దవడకు పాకుతోందని కొందరు వైద్యులు చెబుతున్నారు. మందు గోలీల వల్ల కొందరికి ఉపశమనం లభిస్తోందని తెలిపారు. రూ.3,500 ధర ఉండే ఆంఫొటెరిసిన్‌-బి ఇంజక్షన్‌ను నల్ల బజారులో రూ.20 వేల నుంచి రూ.30 వేలకు విక్రయిస్తున్నారు.

ఇదీ చూడండి: టీకా తీసుకున్నాక సుస్తీ చేస్తే కొవిడ్​ పరీక్ష చేసుకోవాలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.