ETV Bharat / city

Black Fungus in AP: రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,623 కేసులు, 103 మంది మృతి! - black fungus cases news

బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫంగస్‌ లక్షణాలు ముందే గుర్తించలేకపోవడం, చికిత్సకు అత్యవసరంగా ఉపయోగించాల్సిన ఇంజెక్షన్ల కొరత మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,623 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా... 103 మంది మరణించారు. కొవిడ్‌తో పోలిస్తే బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు రేటు ఎక్కువగా ఉంది.

black fungus
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
author img

By

Published : Jun 8, 2021, 6:43 AM IST

రాష్ట్రంలో నిన్నటి వరకు 17,63,211 కరోనా కేసులు నమోదు కాగా 11,552 (0.65%) మరణాలు సంభవించాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,623 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారు. వీరిలో 103 (6.34%) మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్‌తో పోలిస్తే బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో మరణాలు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కరోనా సోకినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొంది.. ఇళ్లకు వెళ్లి, రెండు, మూడు వారాల అనంతరం బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్నారు.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో...

రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 397 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నాయి. చిత్తూరు- 212, కృష్ణా -201, అనంతపురం - 178, కర్నూలు-160, విశాఖ జిల్లాలో 155 చొప్పున కేసులు నమోదయ్యాయి. తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 83 కేసులు నమోదైతే 15 (14.45%) మంది ప్రాణాలు విడిచారు. కర్నూలు జిల్లాలో 14, గుంటూరు-14, విశాఖపట్నం-14, చిత్తూరు జిల్లాలో 13 మంది మృత్యువాతపడ్డారు. అనంతపురం జిల్లాలో 11 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు మరణించారు.

ఇంజెక్షన్ల కొరత ప్రభావం

బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల్లో కొందరికి అత్యవసరంగా ఇవ్వాల్సిన ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్కోసారి ఒకటి, రెండు రోజులపాటు ఆసుపత్రులకు ఇంజెక్షన్లు రావడంలేదు. దీంతో పోసోకొనజోల్‌ ఇంజెక్షన్లు, మాత్రలను బాధితులకు ఇస్తున్నారు. మరోవైపు బ్లాక్‌ఫంగస్‌ను తొలి దశలోనే గుర్తించనందువల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి, మార్కాపురం, దొనకొండ, ఇతర ప్రాంతాల నుంచి బాధితులు ఆలస్యంగా ఒంగోలు జీజీహెచ్‌కు వస్తున్నారు. అప్పటికే వారి కళ్లు మూసుకుపోయి ఉంటున్నాయి.

దవడ వాపు ఎక్కువగా ఉంటున్నందున చికిత్స అందించేలోగా వారి పరిస్థితి విషమిస్తోందని బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స విభాగ పర్యవేక్షకులు డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు. విశాఖ కేజీహెచ్‌లో నమోదైన బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో వైరస్‌ సోకనివారు ఐదుగురు ఉన్నారని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సుధాకర్‌ చెప్పారు. బాధితులు ఆలస్యంగా రావడంవల్ల ముగ్గురు ప్రాణాలు విడిచినట్లు విజయవాడ జీజీహెచ్‌ ఈఎన్‌టీ వైద్య విభాగ అధిపతి ప్రొఫెసర్‌ రవి తెలిపారు.

ఆసుపత్రులకు వచ్చిన వారికి బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నది, లేనిది తెలుసుకునేందుకు పరీక్షలు చేయడానికి, రిపోర్టులు వచ్చేందుకు 48 గంటల వరకు సమయం పడుతోంది. వీటి ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగితే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో సుమారు 50 మందికి శస్త్రచికిత్సలు చేసి ఫంగస్‌ తొలగించారు.

10 రోజులు వాడితే మెరుగైన ఫలితాలు
బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల ముక్కులో ఫంగస్‌ ఉన్నట్లు ప్రాథమిక దశలోనే గుర్తించి, శస్త్రచికిత్స చేసి, ఆంఫోటెరిసిన్‌ ఇంజెక్షన్లను వాడితే మరణాలు బాగా తగ్గుతాయి. విరామం లేకుండా వరుసగా వారం నుంచి పది రోజుల పాటు వాడాలి. ఆ తరువాత పోసోకొనజోల్‌ ఇంజెక్షన్లు, మాత్రలు వాడితే బాధితులు కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయి. మెదడుకు ఫంగస్‌ వ్యాప్తి చెందిన కేసుల్లో మరణాలు ఎక్కువగా ఉంటాయి.- నందకిషోర్‌, ఈఎన్‌టీ వైద్యులు, ప్రధాన కార్యదర్శి, ఐఎంఏ

కేంద్రం ఇస్తేనే ఇంజెక్షన్లు వస్తాయి
కేంద్రం ద్వారానే ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రానికి 13,105 ఇంజెక్షన్లు వచ్చాయి. 1,225 అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిని బాధితులకు ఇచ్చారు. 91,650 ఆంఫోటెరిసిన్‌ ఇంజెక్షన్ల కోసం కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చాం. కేంద్రం కేటాయించిన కోటా ప్రకారమే ఇవి రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం ఇప్పటివరకు 12,250 పోసోకొనజోల్‌ ఇంజెక్షన్లు 1,01,980 మాత్రలు కొనుగోలు చేసింది.- అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ

ఇదీ చదవండి:

బ్లాక్ ఫంగస్‌ సోకిన 15 నెలల బాలుడికి ప్రాణం పోసిన వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.