ETV Bharat / city

BANDI SANJAY: 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న 'ప్రజాసంగ్రామ యాత్ర' - బండి సంజయ్​ పాదయాత్ర వార్తలు

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా వికారాబాద్​ జిల్లా మోమిన్​పేట వద్ద భాజపా శ్రేణులు టపాసులు కాల్చి, బెలూన్లు ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. ఇక్కడే సంజయ్​ వంద కిలోల కేక్​ కట్​ చేశారు.

BANDI SANJAY PADAYATRA COMPLETED 100 KILOMETERS
బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర
author img

By

Published : Sep 6, 2021, 4:36 PM IST

100 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న ప్రజాసంగ్రామ యాత్ర

2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజపా (bjp) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(bandi sanjay) చేపట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేటికి సంజయ్​ పాదయాత్ర 10 రోజులకు చేరుకొంది. ఈ సందర్భంగా వికారాబాద్​ మోమిన్​పేట వద్ద బాణసంచా కాల్చి, బెలూన్లు ఎగురవేసి భాజపా శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. మోమిన్​పేట వద్ద బండి సంజయ్​ వంద కిలోల కేక్​ను కట్​ చేశారు.

ఈనెల 7న సంగారెడ్డిలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, 9న ఆందోల్‌ జోగిపేట్‌లో పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి విజయ్‌ సోంకర్ శాస్త్రి, మెదక్‌ నర్సాపూర్‌లో జరిగే పాదయాత్రలో ఛత్తీస్‌గడ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్​సింగ్‌ తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 28న చార్మినార్‌(charminar) భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజాసంగ్రామ యాత్రకు బండి సంజయ్​ సమరశంఖం పూరించారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయ మార్పునకు వేదిక కానుందన్నారు

అక్టోబర్ 2న.... హుజూరాబాద్ సభతో తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 2023 ఎన్నికల వరకు విడతల వారీగా ప్రజాసంగ్రామ యాత్రను చేపట్టనున్నట్లు భాజపా నేతలు వెల్లడించారు.

ఇదీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.