అన్యమతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదని...భక్తి విశ్వాసాలతో శ్రీవారిని దర్శించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించడాన్ని భాజపా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ విషయం యావత్ భారతదేశంలోని అన్యమతస్థులకు వర్తించే వ్యవహారమని, ఇది గమనించి ప్రకటన చేయాల్సిన సందర్భంలో వివాదాస్పదమైనటువంటి అంశాన్ని తితిదే ఛైర్మన్ ప్రస్తావించడం అనాలోచిత వైఖరిగా విమర్శించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తిరుమలను సందర్శించినప్పుడు.. రిజిస్టర్‌లో సంతకం చేసి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి : 'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'