ఏపీ స్థానిక ఎన్నికల్లో హింస జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు భాజపా ఎంపీలు లేఖ రాశారు. భాజపా ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేశ్, జీవీఎల్.. అమిత్‌షాకు లేఖ సమర్పించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు చేస్తోందని ఫిర్యాదు చేసినట్లు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని వైకాపా నేతలు బెదిరిస్తున్నారని... అధికార వైకాపాకు ఎన్నికల అధికారులు సహకరిస్తున్నారని హోంమంత్రికి తెలియజేసినట్లు వెల్లడించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులు కూడా బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. కార్యాలయాలకు పార్టీ రంగుల తొలగింపు ప్రక్రియ.. వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీఎం రమేశ్ ఆరోపించారు. భాజపా నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. హోంమంత్రి సానుకూలంగా స్పందించారని.. ఇలాగే ఉంటే చర్యలు తీసుకుంటామన్నారని రమేశ్ వెల్లడించారు.
ఇదీ చదవండి:
తెదేపా అభ్యర్థి ఇంట్లో అక్రమ మద్యంపై ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ