ETV Bharat / city

అమలాపురం హింస ప్రభుత్వ పన్నాగమే.. దానికోసమే..: భాజపా

BJP on Konaseema violence: ప్రభుత్వ ప్రణాళిక ప్రకారమే అమలాపురంలో హింస జరిగిందని భాజపా నేతలు ఆరోపించారు. ఇది వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రభుత్వ పన్నాగంగా కనిపిస్తోందన్నారు. అంబేడ్కర్ పేరును ప్రభుత్వం.. రాజకీయ వివాదంలోకి లాగిందని.. దేశ, రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

1
1
author img

By

Published : May 25, 2022, 11:58 AM IST

Updated : May 25, 2022, 8:55 PM IST

అమలాపురం హింస ప్రభుత్వ పన్నాగమే

BJP on Konaseema violence: అమలాపురం హింస.. ప్రణాళిక ప్రకారమే జరిగిందని భావిస్తున్నామని భాజపా నేత సత్యకుమార్‌ అన్నారు. ఓ మంత్రికే ఇలా జరిగిందంటే ఏపీలో పరిస్థితి అర్థమవుతోందన్నారు. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ప్రభుత్వ పన్నాగంగా ఇది కనిపిస్తోందని ఆరోపించారు. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. వైకాపా నేతల్లో కొందరు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్ స్పష్టం చేశారని తెలిపారు. విశ్వరూప్ వ్యాఖ్యలు చూస్తే అధికార పార్టీ నేతల హస్తం ఉందని అర్థమవుతోందని పేర్కొన్నారు. 7 నియోజకవర్గాల జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టి ఆ జిల్లాకే పరిమితం చేస్తారా? అని ప్రశ్నించారు. దావోస్ వెళ్లిన సీఎం ఒక్క పైసా పెట్టుబడి కూడా ప్రత్యేకంగా రాలేదని విమర్శించారు.

వైకాపా ప్రభుత్వానికి మారణహోమం జరగడం కావాలని సోము వీర్రాజు అన్నారు. వైకాపా ప్రభుత్వమే అంతా చేసిందన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో చేశారని తెలిపారు. కోనసీమలో ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కోనసీమలో రెండు వర్గాలకు విభేదాలు ఉన్నాయని చెప్పారు. నిన్నటి పరిస్థితి మరో యుద్ధాన్ని తలపించిందని... యుద్ధం జరగడానికి కారణం జగన్‌ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు సుబ్రహ్మణ్యం హత్యలో అనంతబాబు స్టేట్‌మెంట్‌ తప్పని సోమువీర్రాజు ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్​ చేశారు. రేషన్ బియ్యం విషయంలో పెద్ద కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. మిల్లరు, ప్రభుత్వం ఒక్కటై రైతులను ఇబ్బంది పెడుతున్నారని సోమువీర్రాజు మండిపడ్డారు.

వైకాపాకు ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేడ్కర్ పేరు పెట్టొచ్చుగా? అని ఎంపీ జీవీఎల్‌ అన్నారు. కోనసీమలో హింసను ఖండించారు. కోనసీమ ఆందోళనల్లో భాజపా నేతలెవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ పేరును ప్రభుత్వం... రాజకీయ వివాదంలోకి లాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ, రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఏపీలో శాంతిభద్రతల వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోందన్నారు. జిన్నా టవర్స్ పేరు మార్చాలని కోరితే తమ నేతలను అరెస్టు చేశారని దుయ్యబట్టారు. హిందూ వ్యతిరేక విధానాలు వీడకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని భాజపా ఎంపీ జీవీఎల్‌ అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2022, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.