తెలంగాణ భాజపా నాయకుడు ఈటల రాజేందర్ ప్రజా జీవన యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర... శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా తొలిరోజు పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 127 గ్రామాల మీదుగా 23 రోజుల పాటు జరిగే ఈ యాత్ర 270 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు.
ఇదీ చదవండి: