తెలంగాణలో జరిగిన ప్రవీణ్‌రావు అతని సోదరుల అపహరణ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్ విఖ్యాతారెడ్డిలు మూడో రోజు బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. కాగా ఇదే కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల అయిన విజయవాడకు చెందిన 11మంది నిందితులు ఠాణాకు హాజరయ్యారు.
భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డిలు సమర్పించిన 8మంది ష్యూరిటీలు పరిశీలనలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. గురువారం మరోసారి పీఎస్‌కు హాజరుకావాల్సి ఉందని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇరువురు పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఠాణాకు వచ్చి విచారణకు సహకరించాల్సి ఉందని అన్నారు.
ఇదీ చూడండి: