ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆరోగ్యవంతమైన ఇద్దరు వాలంటీర్లకు నిమ్స్‌లో.. సోమవారం వైద్యులు తొలి విడత వ్యాక్సిన్ ఇచ్చారు. వారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, క్లినికల్ ట్రయల్స్ బృందం సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు తమ ప్రయత్నం కొనసాగిస్తామని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐదు దశల్లో క్లినికల్ ట్రయల్స్ ఉంటాయన్నారు. ఇతర దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని చెప్తున్న డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇవీ చూడండి: