ETV Bharat / city

కొవాగ్జిన్.. యూకే స్ట్రెయిన్‌పైనా పని చేస్తుంది: సీఎండీ

author img

By

Published : Jan 4, 2021, 6:35 PM IST

కొవాగ్జిన్‌పై వచ్చిన విమర్శలను భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల కొట్టిపారేశారు. తన కుటుంబానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. కొవాగ్జిన్​ యూకే స్ట్రెయిన్​పై కూడా పని చేస్తోందని స్పష్టం చేశారు.

bharat-biotech-cmd-krishna-ella
భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల

యూకే స్ట్రెయిన్‌పై కూడా కొవాగ్జిన్ చక్కగా పని చేస్తుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తమ ప్రయోగ పద్ధతులను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఆమోదించిందని వెల్లడించారు. భారత్‌ బయోటెక్‌ ఏ విదేశీ సంస్థకూ తీసిపోదని స్పష్టం చేశారు. తమ సంస్థ ఫైజర్‌ వంటి విదేశీ సంస్థలతో సమానంగా పబ్లికేషన్స్‌ కలిగి ఉందని వ్యాఖ్యానించారు. తాము 25 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించామన్నారు. వాలంటీర్లపై ప్రయోగాలు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్స్‌గా చెప్పొచ్చని వివరించారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో తమకు సుదీర్ఘ అనుభవం ఉందని ఉద్ఘాటించారు.

మేం 16 వ్యాక్సిన్లు రూపొందించాం. భారత్‌తో పాటు అనేక దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం. 12 దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాం. - కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌ సీఎండీ

కొవాగ్జిన్‌పై వచ్చిన విమర్శలను భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల కొట్టిపారేశారు. తమ డేటాలో పారదర్శకత లేదన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. కొన్ని భారతీయ కంపెనీలు మాపై దుష్ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. తమ వాక్సిన్‌పై కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తన కుటుంబానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. వదంతుల ద్వారా భారతీయ కంపెనీలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.