భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహవచనం చేసి కంకణాలకు పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని స్వాములకు, బేడా మండపంలోని ఉత్సవమూర్తులకు కంకణధారణ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కంకణాలను ధరించారు.
ఈరోజు సాయంత్రం యాగశాలలో వాస్తు హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా నేడు ఆలయ ఈవో శివాజీ, అర్చకులు, ఉద్యోగులకు దీక్ష వస్త్రాలు అందించారు.
ఇదీ చదవండి: తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన