ETV Bharat / city

'అపోహలు నమ్మొద్దు.. అయోమయానికి గురి కావొద్దు' - కోవిడ్ హెల్ప్‌ డెస్క్‌లు

చరవాణితో ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ చరవాణుల్లోని సమాచారంపైనే ఆధారపడుతున్నారు. అందులో వాస్తవికత ఉంటే ఇబ్బంది ఉండదు. అదే అవాస్తవం ప్రచారం చేస్తే మాత్రం అందరూ భయాందోళనలకు గురవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

police taking charge on fake news spreaders
అపోహలు నమ్మొద్దు.. వాస్తవాలు తెలుసుకుందాం
author img

By

Published : Mar 29, 2020, 12:55 PM IST

కొవిడ్-19 కట్టడికి అంతర్జాలం, చరవాణి ముఖ్య ఆయుధాలుగా పని చేస్తున్నాయి. ఈ క్రమంలో.. అసత్యాలు అంతే త్వరగా విస్తరిస్తున్నాయి. అటువంటి వాటికి చెక్ పెట్టడానికే వినూత్న ఆలోచన చేస్తున్నారు అధికారులు. దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో కరోనా కట్టడికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదం చేసింది. మన వద్ద కూడా అలాంటి పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవడమే కాక.. జనం ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఎక్కడికక్కడ సేవలందుకునే దిశగా చేస్తున్న ప్రయత్నం అమరావతిలో ఇప్పటికే ఆరంభమైంది.

నోట్‌క్యామ్‌ యాప్‌

కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సర్వే ప్రారంభించింది. సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య ఆరోగ్య శాఖ సర్వే నిర్వహిస్తోంది. నోట్‌క్యామ్‌ యాప్‌ ద్వారా.. కరోనా బాధితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే జరుగుతోంది. జీపీఎస్‌ కెమెరాతో కూడిన ప్రాంత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడం ఈ యాప్‌ ప్రత్యేకత. యాప్‌లో వివరాలు నమోదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎక్కడి నుంచైనా ఉన్నతాధికారులు తెలుసుకోవచ్చు.

వినూత్న ఆలోచనలు..సేవలు

విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం చేసేందుకు ప్రజా ఫిర్యాదుల నెంబరు 103ని ఏర్పాటు చేసింది. చరవాణి ద్వారా కూడా పౌరసేవల్ని అందించే చర్యల్ని కొవిడ్‌ నేపథ్యంలో తీసుకుంది. 81819 60909 ఈ నెంబరుకు వాట్సాప్‌ లేదా టెలిగ్రామ్‌లో ఎటువంటి సమస్యపై అయినా ఫిర్యాదు చేయవచ్చు. సమస్యల్ని ఫోన్‌ ద్వారానే పరిష్కరిస్తున్నారు.

టోటల్ ఫ్రెష్ యాప్..

మంగళగిరి పురపాలక సంఘ కమిషనర్‌ హేమామాలిని కరోనా నేపథ్యంలో జన సమూహాల్ని నియంత్రించి ఇంటింటికి పౌరసేవలందించేందుకు వినూత్న ఆలోచన చేశారు. ‘‘టోటల్‌ ఫ్రెష్‌ యాప్‌’’ పేరుతో నూతన యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. ఆరు ప్రధాన కూరగాయల మార్కెట్లకు సంబంధించిన వ్యాపారుల్ని అనుసంధానం చేశారు. కూరగాయలతోపాటు నిత్యావసర వస్తువులు అవసరమైనవారు ఫోన్‌చేస్తే చాలు ఇంటికే అవి అందేలా చర్యలు తీసుకున్నారు.

యాప్‌ ఉంటే ఎక్కడికక్కడే సేవలు..

కరోనాపై ప్రజల్లో చైతన్యం పెంచడమే కాక.. అనుమానితులు, బాధితులకు సత్వర సేవలందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొవిన్‌-20 యాప్‌ రూపకల్పన చేసింది. చరవాణుల్లో దీన్ని నిక్షిప్తం చేసుకుంటే చాలు జీపీఎస్‌ ఆధారంగా మన ప్రయాణ వివరాల్ని ఎప్పటికప్పుడు కేంద్రం పరిశీలిస్తూ అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు దగ్గర్లో ఉన్న క్వారెంటైన్‌.. ఐసోలేషన్‌ కేంద్రాల సేవలపై అవగాహన కల్పించి సత్వర వైద్య సేవలందేలా చూస్తోంది.

తప్పుడు ప్రచారంతో జైలుకే..

కరోనా పాజిటివ్‌ కేసు అంటూ... నరసరావుపేటలో ఒక యువకుడు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేశాడు. పురపాలక సంఘ కమిషనర్‌ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. తప్పుడు ప్రచారం చేసినందుకు ఆ వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో కరోనాపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని నమ్మవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాయి.

హెల్ప్‌ డెస్క్‌లు:

కచ్చితమైన సమాచారంతోపాటు ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిని తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం మైగావ్‌ కరోనా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసింది. 90131 51515 నెంబరును చరవాణిలో నిక్షిప్తం చేసుకుని మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు. కొవిడ్‌-19కి సంబంధించి సమాచారం సంక్లిప్త సందేశాల రూపంలో ప్రత్యక్షమవుతుంది. కరోనాపై 24 గంటలపాటు సేవలందించే ఫోన్‌ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అసత్య ప్రచారం కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నెంబరుతో సేవలు పొందవచ్చు.

ఇదీ చూడండి:

రాష్ట్రానికి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.