ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. కరోనా కారణంగా అవార్డుల ప్రదానాన్ని ఈ ఏడాది నిలిపివేసింది. ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోవాలని, ప్రతిపాదనలు కమిషనరేట్‌కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా అవార్డుల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించట్లేదని తెలిపింది.
అంతేకాకుండా కరోనా కారణంగా పనిదినాలను తగ్గించటంతో.. అదే నిష్పత్తిలో సాధారణ సెలవులను కుదించింది. ఉపాధ్యాయులకు 12 నెలలకు 22 సెలవుల లెక్కన ఆగస్టు నుంచి డిసెంబరుకు తొమ్మిది, ఉపాధ్యాయినిలకు 27 సెలవుల లెక్కన 11 సాధారణ సెలవులు ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి: IAS TRANSFERS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ