భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతపక్ష తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామయ్యకు భేరి పూజ నిర్వహించారు. ఈరోజు సాయంత్రం దేవతాహ్వానం, హనుమత్ వాహన సేవ కార్యక్రమం చేపట్టారు. ఆలయంలోని మృదంగాలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బలిహరణం సేవలు నిర్వహించారు. మంగళవారం యాగశాల పూజ, చతుస్థానార్చనము, గరుడ వాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం జరపనున్నారు. ఈనెల 21న సీతారాముల కల్యాణం, 22న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు సర్వ, శీఘ్ర దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.
ఇదీ చూడండి: