న్యాయస్థానాల్లో వాదనలు , తీర్పులు మాతృభాషలో ఉండాలని కోరుతూ భారతీయ భాష ఆందోళన్ సంస్థ ప్రతినిధులు గవర్నర్ బిశ్వభూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు . రాష్ట్రంలో తీర్పులు తెలుగులో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ అంశంపై పోరాటం చేస్తున్నామన్నారు . ఇప్పటికే యూపీ , మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , బిహార్‌లలో మాతృభాషలోనే తీర్పులు ఇస్తున్నారని చెప్పారు. కోర్టులో వాదనలు ప్రాంతీయ భాషల్లో జరిగితే సామాన్యులకు అర్ధమవుతుందన్నారు . భవిష్యత్‌లో తెలుగులో జడ్జిమెంట్లు అనే అంశంపై సైకిల్ యాత్ర చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఇదీ చదవండి: Judges Transfers: హైకోర్టు జడ్జీల బదిలీ.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు నియామకం