ETV Bharat / city

బార్బిక్యూ రైడ్​...ఆహార ప్రియులకు ఓ సరికొత్త ట్రెండ్​ - ఏలూరులో బార్బిక్యూ రైడ్​ వార్తలు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌... చూపుతిప్పుకోలేం. సౌండు గంభీరమే. రోడ్డుమీద రైడ్ చేస్తే వైబ్రేషన్ కాదే అటెన్షన్ కూడా తెస్తుంది. అలాంటి బండిమీద బార్బీక్యూ చికెన్ చేసి అమ్మితే ఎలా ఉంటుంది? క్రేజీ ఐడియా కదా..పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కవలలైన ఇద్దరు అన్నదమ్ములు అలాగే ఆలోచించారు. రోడ్డు పక్కనే నిప్పులపై కాల్చిన చికెన్‌ జాయింట్లు వేడివేడిగా అందిస్తున్నారు.

barbecue ride  a new trend for food lovers

author img

By

Published : Mar 1, 2020, 5:13 AM IST

బార్బిక్యూ రైడ్‌ పేరుతో ప్రారంభమైన సరికొత్త ట్రెండ్‌ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కవలలైన ఇద్దరు యువకులు రోడ్డు పక్కనే నిప్పులపై కాల్చిన చికెన్‌ జాయింట్లు వేడివేడిగా అందిస్తున్నారు. ఆధునిక రీతిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై చేసిన ఈ ఏర్పాటు, ప్రతి ఒక్కరూ ఓసారి ఆగి తిని వెళ్లేలా నోరూరిస్తోంది.

బార్బిక్యూ రైడ్​...ఆహార ప్రియులకు ఓ సరికొత్త ట్రెండ్​

ఆ రుచే వేరు...

జ్యూసీ చికెన్‌, స్మోకీ చికెన్‌, స్లో కుక్డ్‌ ఇలా పెద్దపెద్ద రెస్టారెంట్లలో మాత్రమే లభ్యమయ్యే మాంసాహార వంటకాలు నామమాత్రపు ధరకే బార్బిక్యూ రైడ్‌లో దొరుకుతాయి. స్పైసీ గ్రిల్డ్‌ పైనాపిల్‌ అంటూ శాఖాహార రుచులూ అందుబాటులో ఉన్నాయి. ముందే తగిన మసాలాలో నానబెట్టిన చికెన్‌ ముక్కలను కళ్ల ముందే బొగ్గులపై కాల్చి ఇస్తుంటే... ఆ రుచే వేరంటూ వినియోగదారులు లొట్టలేస్తూ లాగిస్తున్నారు.

ధర తక్కువే

కొత్తదనం, తక్కువ ధర, మళ్లీ మళ్లీ తినాలనిపించే రుచి... ఈ లక్షణాలే బార్బిక్యూ రైడ్‌ చికెన్‌ను రోజురోజుకీ వినియోగదారులకు చేరువ చేస్తున్నాయి. 50నుంచి వంద రూపాయలతోనే వేడివేడి నోరూరించే చికెన్‌ వంటకాలు నించున్న చోటే తృప్తిగా తినొచ్చు. బెంగళూరులో ప్రారంభమైన ఈ సంచార నిప్పుల చికెన్‌ ప్రయోగం... క్రమక్రమంగా పలు నగరాలు, పట్టణాలకు విస్తరిస్తోంది.

ఇదీ చదవండి : తిరుపతి రుయాలో చేరిన తైవాన్ వాసి.. కరోనా వార్డులో చికిత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.