ETV Bharat / city

'అప్పు' డే కాదు - అమరావతి అభివృద్ధికి రుణాలు ఇవ్వడానికి ముందుకు రాని బ్యాంకులు

రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులు ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. సకాలంలో రుణం అందే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఏఎంఆర్‌డీఏకు హామీ ఇస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా తక్షణ మంజూరుకు బ్యాంకులు సిద్ధంగా లేవని సమాచారం.

నిర్మాణంలో ఉన్న భవనం
నిర్మాణంలో ఉన్న భవనం
author img

By

Published : Apr 9, 2021, 6:50 AM IST

రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులు ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. సకాలంలో రుణం అందే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఏఎంఆర్‌డీఏకు హామీ ఇస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా తక్షణ మంజూరుకు బ్యాంకులు సిద్ధంగా లేవని సమాచారం. అమరావతిలో వివిధ భవనాల నిర్మాణానికి గతంలో తామిచ్చిన రూ.3వేల కోట్ల రుణం మాటేంటని, ఆ ప్రాజెక్టును పూర్తిచేసి, ‘క్లోజర్‌ రిపోర్టు’ సమర్పిస్తే తప్ప కొత్త రుణానికి సిఫార్సు చేయలేమని బ్యాంకులు చెబుతున్నట్లు తెలిసింది.

గతంలో రూ.2,060 కోట్ల రుణం
అమరావతిలో మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌, నాల్గో తరగతి ఉద్యోగులకు అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ల కన్సార్షియం నుంచి అప్పట్లో సీఆర్‌డీఏ రూ.2,060 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి ఏఎంఆర్‌డీఏ ప్రతినెలా రూ.11 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తోంది.

ఇప్పుడు మళ్లీ ఇదే కన్సార్షియం నుంచి రాజధానిలో ప్రధాన మౌలిక వసతులు, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధికి రూ.10 వేల కోట్ల వరకు రుణం తీసుకోవాలని ఏఎంఆర్‌డీఏ భావించింది. తొలి విడతలో రూ.3 వేల కోట్లు, రెండో విడతలో రూ.3 వేలు కోట్లు, మూడో విడతలో రూ.4 వేల కోట్లు చొప్పున ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లు ఏఎంఆర్‌డీఏ పేర్కొంది. తొలి విడత పనుల డీపీఆర్‌లుఅందజేస్తే.. రుణ మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని బ్యాంకులు మొదట్లో చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు బ్యాంకులు కొత్త మెలిక పెడుతున్నాయని, గతంలో భవనాల నిర్మాణానికి తాము రుణమిచ్చాం కాబట్టి, వాటిని పూర్తి చేసి, క్లోజర్‌ రిపోర్టు ఇవ్వాలని కోరుతున్నాయని ఏఎంఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.

రుణం ఇచ్చేందుకు ఆ బ్యాంకుల షరతులేంటో లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఏఎంఆర్‌డీఏ అధికారులు కోరినట్లు తెలిసింది. బ్యాంకులు నుంచి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపి, తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని ఏఎంఆర్‌డీఏ భావిస్తున్నట్లు తెలిసింది. అమరావతిలో పనులన్నీ 2019 మే నెలాఖరున ప్రభుత్వం నిలిపివేసింది. అనంతరం వివిధ సందర్భాల్లో అమరావతిపై జరిగిన సమీక్షల్లో... పనులు కొనసాగించేందుకు సీఎం సుముఖత వ్యక్తంచేసినట్లు చెబుతూ వచ్చారు. తాజాగా గతనెల 24న పురపాలక శాఖ జారీ చేసిన జీవోలో... అమరావతిలో గతంలో రూ.29,281.98 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా... వాటిని ప్రస్తుతం రూ.11,092.88 కోట్లకు కుదించినట్లు వెల్లడించారు.

రూ.4,377.35 కోట్లతో ప్రధాన మౌలిక వసతులు, రూ.6,715.18 కోట్లతో ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లు అభివృద్ధి చేసేందుకు 2020 ఆగస్టు 13న జరిగిన సమీక్షలో సీఎం అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం రూ.3 వేల కోట్ల రుణానికి గ్యారంటీ ఇవ్వడానికి ప్రభుత్వానికి 8 నెలలకుపైగా పట్టింది. ఇప్పుడు బ్యాంకులు రుణం ఇవ్వడంపై సందిగ్ధత నెలకొంది. బ్యాంకులు రుణం ఇచ్చేందుకు అంగీకరించినా వాటికి డీపీఆర్‌లు సమర్పించడం, మిగతా పేపర్‌ వర్క్‌ పూర్తయ్యేసరికి 6 నుంచి 8 నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త బ్యాంకుల్ని చూసుకోవలసి వస్తే మరింత జాప్యం జరుగుతుంది.

3 బ్యాంకుల కన్సార్షియం
రాజధాని పనులకు తొలి విడతలో రూ.3 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకుల కన్సార్షియం సూత్రప్రాయంగా అంగీకరించిందని, 3బ్యాంకులు తలో రూ.వెయ్యి కోట్ల రుణం ఇవ్వనున్నాయని మార్చి 24న జారీ చేసిన జీవోలో పురపాలకశాఖ పేర్కొంది. రూ.1206.39 కోట్లతో అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల పనులు, రూ.1879 కోట్లతో ఆరు ఎల్‌పీఎస్‌(ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం) జోన్లలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో వెల్లడించింది. కానీ ఆ బ్యాంకులు ఇప్పుడు పాత రుణంతో మెలిక పెట్టాయి. వారితో సంప్రదింపులు జరిపి, కొత్త రుణంపై ఒప్పించేందుకు చాలా సమయం పడుతుందన్న భావనలో ఏఎంఆర్‌డీఏ అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి: కోబ్రా జవాను రాకేశ్వర్‌ సింగ్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.