ETV Bharat / city

సూపర్ బ్రాండెడ్ షూస్.. వీటి ధర ఎంతో తెలుసా..?

ఈ బూట్లను చూసిన వెంటనే.. మీ ఫీలింగ్ ఏంటీ..? ఎవరో పూర్తిగా తొక్కేసి.. ఆ తర్వాత మరే యాచకుడి కాళ్లకిందనో పడి.. కొన్ని సంవత్సరాలపాటు నలిగిపోయి.. స్నానం అన్నదే తెలియని షూస్ లాగా కనిపిస్తున్నాయి కదా..?! అలా అనుకుంటే.. మాత్రం మీరు రాంగ్ షూలో కాలు పెట్టినట్టే. అవును మరి.. ఇవి ఇప్పుడే కంపెనీ నుంచి షోరూమ్ లోకి వచ్చిన బూట్లు..! వెరీ.. వెరీ.. ఫ్రె...ష్షు!!

Balenciaga shoe
Balenciaga shoe
author img

By

Published : Sep 21, 2022, 8:02 PM IST

Updated : Sep 21, 2022, 8:08 PM IST

"బాలెన్‌సియాగా" అనే బ్రాండెడ్ కంపెనీ ఈ న్యూ మోడల్ షూస్ తయారు చేసింది. "ఆలస్యం చేస్తే.. ఆశాభంగం తప్పదు.. వెంటనే వచ్చి కొనుక్కుపోండ హో.." అని ప్రకటనలు కూడా చేస్తోంది. కానీ.. వీటిని చూసిన వారిలో నూటికి 99 మంది "యాక్ థూ.." అని ముఖం వికారంగా పెడుతున్నారు. కానీ.. బాలెన్సియాగా కంపెనీ మాత్రం.. ఇవి తాము రూపొందించిన సూపర్ బ్రాండ్ బూట్లు అని చెప్తోంది.

సింగరేణి బొగ్గులో ముంచి తీసినట్టుగా ఉండే ఈ బూట్లకు.. ఫ్యాన్సీ ధరలు కూడా నిర్ణయించారు. లో క్వాలిటీ.. అంటే ఓ మోస్తరుగా పాడైపోయినట్టుగా ఉండే బూట్ల ధర 625 డాలర్లుగా నిర్ణయించారు. అంటే.. మన కరెన్సీలో రూ.49 వేల చిల్లర చెల్లించాలి. అబ్బే.. నాకు ఈ మురికి సరిపోదు.. అత్యంత దరిద్రంగా కనిపించే షూస్ కావాలంటే మాత్రం.. మరింత అదనంగా ఖర్చు చేయాలి. వీటి ధర 1850 డాలర్లు. అంటే.. అక్షరాలా లక్షా 47 వేల 863 రూపాయల 19 పైసలు చెల్లించాలి. ఎంత మాసిపోతే.. అంత ధర మరి!

ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో బాలెన్‌సియాగా కంపెనీని ఓ ఆట ఆడుకుంటున్నారు. "ఈ దరిద్రాన్ని లక్షలు పోసి కొనుక్కోవాలా?" అని కొందరు కామెంట్ చేస్తే.. "ఇంత విలువైన బూట్లను ఎవ్వరికీ అమ్మకండి.. మీరే వేసుకొని తిరగండి.." అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇంకొందరు ఈ బూట్లను.. వాటి ధరను చూసి ఆశ్చర్యపోతున్నారు. "ఇలాంటి బూట్లను అంత డబ్బు పోసి కొనాల్సి అవసరం ఏముంది? కంపెనీ.. ఎందుకిలా చేసింది?" అని సందేహిస్తున్నారు.

బాలెన్‌సియాగా కంపెనీ.. ఇలాంటి షూస్ మొత్తం 100 జతలు తయారు చేసింది. "చాలా తక్కువగా ఉన్నాయి.. త్వరపడండి" అని జనాలకు సూచిస్తోంది. అయితే.. "వీటిని ఎవరు కొంటారు?" అన్నది నూటికి 99 మంది మాట. కానీ.. ఆ ఒక్కరు ఉన్నారు కదా? వారే కొంటారన్నది కంపెనీ ధీమా. ఇది సాధ్యమేనా అంటే.. అసాధ్యమైతే కాదని చెప్పడానికి మన కళ్లముందే బోలెడు ఉదాహరణలు.

ఒకప్పుడు.. దుస్తులకు చిన్న చిరుగు పడితే.. ఎంతగానో సిగ్గుపడేవారు. కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడేవారు. కానీ.. ఇప్పుడు? "టాన్ జీన్స్" అంటూ ముద్దుగా పిలుచుకునే ప్యాంట్లకు.. జనాలు ఎన్ని బొక్కలు పెట్టుకొని తిరుగుతున్నారో మనకు తెలిసిందే. ఎంత ఎక్కువగా చినిగిన ప్యాంట్ వేసుకుంటే.. అంత ఫ్యాషన్ జీవిగా గుర్తిస్తోంది లోకం! ఇదే ఫార్ములా.. ఈ షూస్ కు ఎందుకు అప్లై కాదు..? అన్నది కంపెనీ ఆలోచనగా చెబుతున్నారు.

రొటీన్ కు భిన్నంగా ఉండడమే కదా.. వెరైటీ. వెరైటీగా ఉంటేనే కదా.. గుర్తింపు. దానికోసం అర్రులు చాచేవారు కోకొల్లలు. అలాంటి ఫ్యాషన్ గాయ్స్ లో.. ఎవరో ఒకరు ఖచ్చితంగా కొంటారన్నది కంపెనీ నమ్మకమని అంటున్నారు. ఒకవేళ ఎవ్వరూ కొనగోలు చేయకపోయినా.. వంద జతల షూస్ అనేది ఒక కంపెనీకి పెద్ద విషయమే కాదు. కానీ.. అంతకు మించిన లాభం సోషల్ మీడియా ద్వారా కంపెనీ సంపాదించిందని అంటున్నారు.

ఏ కంపెనీకైనా కావాల్సింది ప్రచారం. ఈ మురికిబట్టిన బూట్లను తయారు చేయడం ద్వారా.. బాలెన్‌సియాగా కంపెనీ.. కావాల్సినంత పాపులారిటీ రాబట్టిందని అంటున్నారు. అసలు.. ఈ షూస్ తయారు చేసింది కూడా అమ్మడానికి కాదని.. కస్టమర్స్ అటెన్షన్ తమవైపు తిప్పుకోవడానికే అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. బాగా లోతుగా థింక్ చేస్తే.. నిజమేనేమో అనిపిస్తోంది కదా..?! మీ ఒపీనియన్ ఏంటి??

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

Last Updated : Sep 21, 2022, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.