తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామ శివారులో గల శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి, హిందూపురం ఎమ్మెల్యే సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, తనయుడు మోక్షజ్ఞలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయాధికారులు స్వామివారి జ్ఞాపికను అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
- ఇదీ చూడండి : బాసరకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు