ETV Bharat / city

తెలంగాణ: రెండు రోజులు అంబులెన్సులోనే గర్భిణీ.. కడుపులోనే శిశువు మృతి - ఆస్పత్రుల నిర్లక్ష్యంతో కడుపులోనే శిశువు మృతి

అమ్మతనమంటే ఎంత ఆనందం? గర్భధారణ మొదలు ఆశల రూపం బయటికొచ్చేదాకా ఎన్నో కలలు... అందరిలానే ఆ తల్లీ కలలు కన్నది. అయితే ఆసుపత్రుల నిర్లక్ష్యం ఆ కలల్ని చిదిమేసింది. పురిటి నొప్పులతో నగరానికి వచ్చిన గర్భిణీకి తీరని శోకం మిగిలింది. కరోనా భయంతో, పడకలు లేవనే సాకుతో పలు ఆసుపత్రులు చికిత్సకు నిరాకరించాయి. 2 రోజుల పాటు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ అంబులెన్సులో తిరిగి నరకం అనుభవించింది. ఈ క్రమంలో తల్లి అనారోగ్యం పాలు కాగా, శిశువు కడుపులోనే కన్నుమూసింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మెదక్​ జిల్లాలో జరిగింది.

baby-died-in-mother-womb-due-to-hospitals-negligence-in-hyderabad
రెండు రోజులు అంబులెన్సులోనే గర్భిణీ.. కడుపులోనే శిశువు మృతి
author img

By

Published : Jul 10, 2020, 9:14 AM IST

తెలంగాణలోని మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట మండలానికి చెందిన విజయ (25)కు నెలలు నిండాయి. జూన్‌ 29న కుటుంబ సభ్యులు వైద్యం కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు.. సరైన సౌకర్యాలు లేవని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఈ నెల 3న నగరానికి వచ్చారు. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారు. అక్కడి నుంచి సోమాజిగూడలోని కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లగా పడకలు లేవని పంపించేశారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లగా.. గర్భిణి పరిస్థితి బాగోలేదని, వైద్యం చేసేందుకు నిరాకరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడా వైద్యానికి నిరాకరించడం వల్ల కుటుంబ సభ్యులు 100 నంబర్‌కు ఫోన్‌ చేశారు.

పోలీసులు వచ్చి వైద్యం చేయాలని సూచించారు. చికిత్సకు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడం వల్ల చేసేదేంలేక సొంతూరికి వెళ్లిపోయారు. తెలిసిన వారి సలహాతో 5న సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెంది ఉన్నందున ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి శిశువును బయటకు తీశారు. తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటం వల్ల గురువారం ఆమెను డిశ్ఛార్జి చేశారు.

ఇవీ చూడండి:

కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.