విశాఖ స్టీల్ ప్లాంటు పోయినా పర్వాలేదు... తనను జైళ్లో పెట్టొదని జగన్ రెడ్డి వేడుకుంటున్నారా? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఉక్కు కర్మాగారం అమ్మకం నిర్ణయంపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
"స్టీలు ప్లాంటు కూడా విజయసాయిరెడ్డి డైరెక్షన్లో జగన్ రెడ్డి కొంటున్నారన్న అనుమానం కలుగుతోంది. దిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచి ఉక్కు కర్మాగారం అమ్మకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారా?. ఉత్తరాంధ్రలో భూములన్నీ ఇప్పటికే దోచుకుంటున్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటైంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలన్న కేంద్రం నిర్ణయం దారుణం. పార్టీలకతీతంగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. నాటి ఉద్యమంలో చాలా మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉద్యమంలో ఉన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకుండా చూడాల్సిన బాధ్యత వెంకయ్యనాయుడుపైనా ఉంది'' అని అయ్యన్న అన్నారు.
ఇదీ చదవండి: హెచ్‌పీసీఎల్ రిఫైనరీ నుంచి భారీగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు