ETV Bharat / city

Waqf Board Funds: రూ.60లక్షల వక్ఫ్‌ నిధుల ధారాదత్తానికి యత్నం?

author img

By

Published : Sep 12, 2022, 10:20 AM IST

Waqf Board Funds: వక్ఫ్‌బోర్డు పాలక మండలి తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ఓ గుత్తేదారుకు రూ.60 లక్షల వక్ఫ్‌ నిధులను ధారాదత్తం చేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా గుత్తేదారుకు కట్టబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

Sixty lakhs
వక్ఫ్‌బోర్డు

Waqf Board Funds: వక్ఫ్‌బోర్డు పాలక మండలి తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ఓ గుత్తేదారుకు రూ.60 లక్షల వక్ఫ్‌ నిధులను ధారాదత్తం చేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019-20లో నెల్లూరు జిల్లా బారాషాహీద్‌ దర్గా (రొట్టెల పండుగ) టెండరుకు సంబంధించిన ఈ నిధులను తాజాగా ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టడం గమనార్హం. గతంలో సదరు గుత్తేదారు ఈ మొత్తాన్ని చెల్లించాలని కోర్టుకు వెళ్లగా అప్పటి వక్ఫ్‌బోర్డు అధికారులు... ఇదివరకే గుత్తేదారు దర్గా నుంచి ఆదాయాన్ని పొందారని, చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికీ నివేదించారు. రాజకీయంగా ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదు. దీనిపై వక్ఫ్‌బోర్డు అధికారులు గతంలో రిటైర్డ్‌ జడ్జి నుంచి న్యాయ సలహా తీసుకున్నారు. ఆయనా సదరు గుత్తేదారుకు ఎలాంటి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టులో కేసు ఉన్నా నిధులిచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడంపై పాలక మండలిలోనే విస్మయం వ్యక్తమవుతోంది. దీని వెనుక నెల్లూరు జిల్లా అధికార పార్టీకి చెందిన కీలక నేత మంత్రాంగం ఉన్నట్లు వక్ఫ్‌బోర్డులో చర్చ జరుగుతోంది.

పాలక మండలిలో చర్చ: ఇటీవల నిర్వహించిన పాలకమండలి సమావేశంలో సదరు గుత్తేదారుకు రూ.60 లక్షలు చెల్లింపు వ్యవహారాన్ని వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ చర్చకు తీసుకువచ్చినట్లు సమాచారం. కొందరు సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. న్యాయసలహా వ్యతిరేకంగా ఉన్నా ఎలా ముందుకు వెళతారని ప్రశ్నించారు. వాటిని పక్కన పెట్టి మెజారిటీని కారణంగా చూపుతూ సభ్యుల ఆమోదం కోసం పంపారు. వక్ఫ్‌బోర్డులో 8 మంది సభ్యులుండగా ఇద్దరు వ్యతిరేకించారు. మరోసారి న్యాయ సలహా తీసుకోవాలని ఇంకో సభ్యుడు సూచించారు. దీనిపై అధికారులను వివరణ కోరగా....‘ పాలక మండలి సమావేశంలో చర్చించిన విషయం వాస్తవమే. సభ్యుల అభిప్రాయాన్ని కోరాం. దీనిపై తీర్మానం చేయలేదు. నిర్ణయం తీసుకోలేదు. వచ్చే సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది...’ అని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.