ETV Bharat / city

పల్లెపోరులో భగ్గుమంటున్న రాజకీయ కక్షలు

పంచాయతీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌కు ముందు పల్లెల్లో గొడవలు పెచ్చుమీరుతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన గ్రామాల్లోనూ రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. నాలుగో దశ ఎన్నికలకు నామినేషన్లు వేసే క్రమంలో విపక్షాల మద్దతుదారులపై పలుచోట్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో దాడులపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ అండతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నాయకులు నిరసన తెలిపారు.

పల్లెపోరులో పేట్రేగుతున్న దాడులు
పల్లెపోరులో పేట్రేగుతున్న దాడులు
author img

By

Published : Feb 12, 2021, 6:29 AM IST

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ ఘర్షణలు పెచ్చుమీరుతున్నాయి. పలు జిల్లాల్లో అధికార, విపక్ష నాయకుల మధ్య గొడవలు, భౌతిక దాడులకు దారితీస్తున్నాయి. వీటిని నియంత్రించే క్రమంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు వాపోతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టుపురం పంచాయతీ బలరాంపురంలో గురువారం వైకాపా వర్గీయుల దాడిలో ఐదుగురు తెదేపా సానుభూతిపరులు గాయపడ్డారు. ఇక్కడ సర్పంచిగా వైకాపా మద్దతుదారు గెలవగా.. పది వార్డుల్లో ఆరింట తెదేపా సానుభూతిపరులు గెలిచారు. ఉప సర్పంచి పదవి బలరాంపురానికి చెందిన కామెల్లి మోహనరావుకు దక్కింది. వైకాపా నేతలు గ్రామంలో బెస్తవారం విందు ఏర్పాటు చేసిన సందర్భంగా తెదేపాకు చెందిన పలువురిపై అధికార పార్టీ నేతలు దాడికి పాల్పడినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అనసాన గణేష్‌, కామెల్లి కైలాశ్‌, రఘపతి శివ, మక్క నవీన్‌, మక్క రవి గాయపడ్డారు. బాధితులను కోటబొమ్మాళి, శ్రీకాకుళం ఆస్పత్రులకు తరలించారు. టెక్కలి సీఐ కె.నీలయ్య, ఎస్‌ఐ రవికుమార్‌ గ్రామాన్ని సందర్శించారు. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు కోటబొమ్మాళి స్టేషన్‌కు వచ్చి కేసు వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరు గ్రామీణ మండలం దేవరపాళెంలో సర్పంచిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వేమిరెడ్డి అశోక్‌రెడ్డిని అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డుకుని కర్రలతో దాడిచేశారు. బాధితుడు వేమిరెడ్డి హంసారెడ్డి, అయ్యప్పరెడ్డి, హరికృష్ణారెడ్డి, హరిశివారెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుడు పెరుమాల్‌ సువంధరబాబు ఇంట్లోకి బుధవారం రాత్రి చొరబడిన హంసకుమార్‌రెడ్డి, అయ్యపరెడ్డి, హరికృష్ణారెడ్డి, హరిశివారెడ్డి.. వార్డు సభ్యుడిగా పోటీ చేయాలంటూ పెరుమాల్‌ను మారణాయుధాలతో బెదిరించారు. తనకు పోటీ ఇష్టంలేదని చెప్పినా వినకుండా కారులో ఎక్కించుకుని కొట్టుకుంటూ సోమశిల వరకు తీసుకెళ్లారు. సువంధరబాబు తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో...

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం ఎంపీడీవో రాజశేఖర్‌రెడ్డి గ్రామస్థులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మండలంలో టెండుల్కర్‌, భాస్కర్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదంలో ఎంపీడీవో ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారంటూ గ్రామస్థులు ఆరోపించారు. మొదటి దశలో ఎన్నికలు జరిగిన పి.వి.పురం గ్రామానికి వచ్చిన గురువారం ఎంపీడీవో రాగా.. గ్రామస్థులు అతనితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి ఎంపీడీవోను పంపించేశారు.

తంబళ్లపల్లె మండలంలో 21 పంచాయతీలకు ఇప్పటికే 10 ఏకగ్రీవం కాగా.. మిగిలిన వాటిలో ప్రత్యర్థులకు ప్రచార అవకాశం ఇవ్వడం లేదు. రేణుమాకులపల్లె నుంచి మహబూబ్‌బాషా బరిలో నిలిచారు. ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. నియోజకవర్గంలో శనివారమే ఎన్నికలు కాగా.. ఇప్పటికీ ప్రత్యర్థులకు గుర్తులు కేటాయించలేదు. ఎద్దులవారిపల్లెలో సర్పంచికి నామినేషన్‌ వేసిన విజయభాస్కర్‌ను పరిశీలనలో సక్రమంగా ఉన్నట్లు తేల్చిన అధికారులు.. గుర్తు అడగ్గా ఈ గ్రామం ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా మేడికొండూరులో భాజపా మండలాధ్యక్షుడు పాములపాటి కృష్ణారావుపై దాడి జరగ్గా.. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన తన భార్య లక్ష్మీయశోదతో పేరేచర్లలో వార్డుకు పోటీ చేయించడానికి జనసేన మద్దతుతో నామినేషన్‌ వేశారు. తెదేపాకు చెందిన నందిపాటి అంకమ్మరావు, కాసంనేని రామకృష్ణ, మానుకొండ రవి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం సర్పంచిగా గెలిచిన బెజవాడ వీర వెంకట సత్యనారాయణ అనుచరులు తన ఆస్తులను ధ్వంసం చేశారని ఓడిపోయిన అభ్యర్థి మాదారపు తాతాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటిపై కొబ్బరి బొండాలు, రాళ్లతో దాడి చేశారని, తన ట్రస్టులోని బల్లలను ధ్వంసం చేశారని, తన అనుచరుల లారీ అద్దాలు పగులగొట్టారని వాపోయారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా పల్నాడులో విపక్షాల మద్దతుదారులతో పాటు అధికార పార్టీలోని రెబల్స్‌కు బెదిరింపులు తార స్థాయికి చేరాయి. రెండు, మూడు దశల్లో పల్నాడు ప్రాంతంలో ఎన్నికలు పూర్తిగా జరగనున్నాయి. తాము ప్రచారం చేయడానికి వీల్లేదని, ఓటర్లను కలుసుకోవద్దని రెండు రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని బాధిత అభ్యర్థులు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. రెంటచింతల మండలం పాల్వాయిలో పాశం రామకోటిరెడ్డిని సర్పంచి అభ్యర్థిగా నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ప్రత్యర్థులు ఒత్తిడి తేగా ఆయన అంగీకరించలేదు. గురువారం పొలంలో ఉన్న ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఇది పోలీసుల దాడే అని రామకోటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు.

వినుకొండలో...

వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త ఒకరు తాను తెదేపా మద్దతుదారునికే ఓటేస్తానని చెప్పడంతో ఆయన్ని చితకబాదారు. గురజాల డివిజన్‌లో మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడా పలువురికి బెదిరింపులు తప్పడం లేదు. చిలకలూరిపేట మండలం తాతపూడిలో తమను ప్రచారం చేయనివ్వట్లేదని వార్డు అభ్యర్థులు వాపోతున్నారు. రొంపిచర్ల మండలం అన్నవరంలో ప్రచారానికి వెళ్తే ప్రత్యర్థులు అడ్డుకుంటున్నారని నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని పాల్వాయిలో వైకాపాకు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య ఘర్షణ జరగ్గా పోలీసులు వెళ్లినట్లు తెలిపారు. ఎవరిపైనా తమ సిబ్బంది దాడి చేయలేదని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి

ప్రైవేటీకరణను నిరసిస్తూ నేటి నుంచి నిరవధిక నిరహార దీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.