ETV Bharat / city

హైదరాబాద్ లో కార్పొరేటర్ పై స్థానికుల దాడి - heavy rains in hyderabad latest news

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ రంగానాయకుల గుట్టకాలనీలో నాలా భూమిలన్నీ కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని కార్పొరేటర్ సామ తిరుమల్​ రెడ్డిని నిలదీశారు. కాలనీ వరదలో మునిగిపోతోందంటూ కార్పొరేటర్​పై దాడి చేశారు.

corporator-thirumal tirumal reddy
corporator-thirumal tirumal reddy
author img

By

Published : Oct 18, 2020, 3:57 PM IST

భారీ వర్షాలతో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలకు కారణం నాలాలను కబ్జా చేయడమే అంటున్నారు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ రంగానాయకుల గుట్టకాలనీ వాసులు. నాలా భూమిలన్నీ కబ్జాలకు గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో కార్పొరేటర్ పై స్థానికుల దాడి

ఈ విషయమై గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని కార్పొరేటర్ సామ తిరుమల్​ రెడ్డిని నిలదీశారు. కాలనీ వరదలో మునిగిపోతుందంటూ కార్పొరేటర్​పై దాడి చేశారు. తిరుమల్​ రెడ్డిని గల్లా పట్టుకుని కొట్టారు. చర్చి దగ్గర ఉన్న నాలా కబ్జాకు గురైందని.. ఇన్నీ రోజులుగా కార్పొరేటర్​ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

కనకదుర్గ పైవంతెనపై తప్పని ట్రాఫిక్‌ కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.