ETV Bharat / city

కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలో మజ్లిస్: అసదుద్దీన్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు.

అసదుద్దీన్
అసదుద్దీన్
author img

By

Published : Feb 22, 2021, 6:14 PM IST

2023లో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల బరిలో మజ్లిస్ పార్టీ దిగనుంది. హైదరాబాద్ దారుస్సలాంలో గుల్బర్గా నేతలతో సమావేశమైన మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా గుల్బర్గా నార్త్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా ఇలియాస్ భగవన్ సేట్ పేరును అసద్ ప్రకటించారు. నేతలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని గౌరవించి, మజ్లిస్ అభ్యర్థిని గెలిపించాలని విన్నవించారు. కర్ణాటక శాసనసభలో తమ వాణిని వినిపించాలని కోరారు.

ఇదీ చూడండి:

అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపైనే వైకాపా ఆధారపడింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.