ETV Bharat / city

ముందుగా ఆ 20 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిఘా నేత్రాలు - video surveillance in register office

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ, నిఘా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మెుదటగా 20 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ చేయనున్నారు.

video surveillance in registration offices
సీసీ కెమెరాలు ఏర్పాటు
author img

By

Published : Aug 18, 2020, 9:35 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వీలైనంత త్వరగా వీడియో చిత్రీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ, నిఘా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్​ ప్రాజెక్టుగా 20 రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ కార్యాకలాపాలను వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 20 కార్యాలయాలను ప్రభుత్వం గుర్తించింది. ఆదాయం ఎక్కువుగా ఉండి.. రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే కార్యాలయాలను గుర్తించారు. విజయనగరం, విశాఖ, మధురవాడ, ఆనందపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, పటమట, గుణదల కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ చేయనున్నారు. వీటితో పాటు గుంటూరు, మంగళగిరి, కొరిటెపాడు, నరసరావుపేట, ఒంగోలు, తిరుపతి, రేణిగుంట, కడప, కర్నూలు కార్యాలయాల్లో వీడియో చిత్రీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 లక్షలకు చేరువలో.. కొత్తగా 6,780 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.