ETV Bharat / city

తెలంగాణలో ఈనెల 25 నుంచి బతుకమ్మ.. నిర్వహణపై అధికారుల సమీక్ష - telangana latest news

arrangements for the Bathukamma festival: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగకు హైదరాబాద్‌ మహానగరం ముస్తాబవుతోంది. పండగ ఏర్పాట్లపై బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌, డీజీపీలు కలిసి వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 3వరకు బతుకమ్మ పండుగ ఉంటుందని ప్రకటించారు.

bathukamma
bathukamma
author img

By

Published : Sep 19, 2022, 7:38 PM IST

arrangements for the Bathukamma festival: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండగ ఏర్పాట్లపై బీఆర్కే భవన్‌లో ప్రభుత్వసలహాదారు రమణాచారి, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈనెల 25 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు బతుకమ్మ పండగ ఉంటుందని, సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్‌ 3న ట్యాంక్‌ బండ్‌ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.

మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని చెప్పారు. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని, నిర్వహణ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉండాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.