చలికి తట్టుకోలేక విధి నిర్వహణలో ఉన్న జవాను ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లా జామి మండలం పాతభీమసింగికి చెందిన పాండ్రంగి చంద్రరావు (42) 17 ఏళ్ల కిందట ఆర్మీలో చేరారు. ప్రస్తుతం లద్దాఖ్‌లోని 603-ఈఎంఈ బెటాలియన్‌లో నాయక్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం లద్దాఖ్‌కు 20 కి.మీ.ల దూరంలోని బింగాలక అనే మంచు ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగా, చలికి తట్టుకోలేక కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. మృతదేహాన్ని రెండు రోజుల్లో భీమసింగికి తీసుకురానున్నారు. చంద్రరావు తల్లిదండ్రులు మరణించగా, భార్య సుధారాణి ఇద్దరి పిల్లలతో విశాఖలో ఉంటున్నారు.
ఇదీ చదవండి
మూడేళ్లకొకసారే పెళ్లి బాజాలు.. తమ ఊరివారితోనే వివాహ సంబంధాలు