ETV Bharat / city

RTC parcels: ఆర్టీసీ పార్సిళ్లు డోర్​ డెలివరీ..ప్రయోగాత్మకంగా అమలు

ఆర్టీసీ పార్సిళ్లను ఇకపై ఇంటివద్దే అందించనున్నారు. ప్రయోగాత్మకంగా పలు జిల్లా కేంద్రాల్లో అమలుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. లాజిస్టిక్స్‌ సేవల ద్వారా ఆదాయ పెంపుదలపై ఆర్టీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా కార్గో రవాణాను డోర్‌ డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం కార్గో డోర్‌ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్‌ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. రోజుకు రూ.50 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్‌ 1 నుంచి కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.

APSRTC parcels
APSRTC parcels
author img

By

Published : Aug 28, 2021, 7:22 AM IST

Updated : Aug 28, 2021, 2:06 PM IST

ఆర్టీసీ తమ సేవల పరిధిని మరింత విస్తృతం చేస్తోంది. ఆర్టీసీ పార్సిళ్లను ఇకపై ఇంటివద్దే అందిస్తారు. సెప్టెంబరు 1 నుంచి ఈ విధానాన్ని 13 జిల్లాకేంద్రాలు, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లో అమలుచేయాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఓ బస్టాండ్‌ నుంచి మరో బస్టాండ్‌కే పార్సిళ్లు బుక్‌ చేస్తున్నారు. వీటిని ఇళ్లవద్దకు అందించేలా పోస్టల్‌శాఖతో చర్చిస్తున్నా అవి కొలిక్కి రాలేదు. దీంతో బస్టాండ్లలో పార్సిళ్లు బుక్‌చేసే గుత్తేదారు ద్వారానే ప్రయోగాత్మకంగా డెలివరీ సదుపాయం ఆరంభించేలా నిర్ణయించారు.

పార్సిల్‌ బుక్‌ చేసుకునేవారు డెలివరీ కావాలంటే అదనపు ఛార్జీ చెల్లించాలి. కేజీ బరువు వరకు జీఎస్టీతోపాటు రూ.15, 1-6 కేజీలకు రూ.25, 6-10 కేజీలకు రూ.30 చొప్పున అదనంగా చెల్లించాలి. ఈ మొత్తంలో 80% డెలివరీ చేసే గుత్తేదారుకు ఆర్టీసీ అందజేయనుంది.

అన్ని అల్ట్రాడీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ అల్ట్రాడీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం అమలుచేసేలా నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా అమలుచేసేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.

కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం కార్గో డోర్‌ డెలివరీ అందిస్తున్న ప్రైవేటు కొరియర్‌ సంస్థలకు భిన్నంగా మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. రోజుకు రూ.50 లక్షల ఆదాయం సాధించడం లక్ష్యంగా సెప్టెంబర్‌ 1 నుంచి కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించనుంది.

ఆర్టీసీ బస్‌ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. తద్వారా జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోంది. ఇక పార్సిళ్లకు ట్రాకింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనుంది. దాంతో బుక్‌ చేసిన పార్సిల్‌ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. బీమా సదుపాయం కల్పిస్తోంది. నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల పల్లెలకు కూడా ఏజంట్ల ద్వారా డోర్‌ డెలివరీ సేవలు అందించేందుకు కార్యాచరణ చేపట్టింది.

ఇదీ చదవండి: కాబుల్​ మృతులు 180 మంది.. మరిన్ని దాడులకు అవకాశం!

Last Updated : Aug 28, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.