ETV Bharat / city

APPSC: 'గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు'

author img

By

Published : Jul 16, 2021, 5:18 PM IST

Updated : Jul 16, 2021, 5:56 PM IST

ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించిన వారిపై చర్యలు ఉండవని.. నిరుద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

appsc
appsc
ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు

గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇప్పటివరకు 1,180 ఖాళీలను గుర్తించామన్నారు. పోస్టులు మరిన్ని పెంచి వచ్చే నెల గ్రూప్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముందన్నారు. ఇకపై గ్రూప్-1 మినహా మిగతా ఏ నోటిఫికేషన్‌కూ ప్రిలిమ్స్ ఉండవని స్పష్టం చేశారు. వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చాక వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇకనుంచి 3, 4 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సలాంబాబు తెలిపారు. ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి యత్నించిన వారిపై చర్యలు ఉండవని.. నిరుద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

Insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్.. హైకోర్టు ఉత్తర్వుల్లో తప్పేముంది: సుప్రీం

Last Updated : Jul 16, 2021, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.