ETV Bharat / city

APPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త...4 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ల వార్తలు

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను(APPSC issued four notifications) జారీ చేసింది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

APPSC
APPSC
author img

By

Published : Oct 13, 2021, 3:38 AM IST

పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను (APPSC issued four notifications)జారీ చేసింది. మొత్తం 38 ఉద్యోగాలు భర్తీకి ప్రకటన జారీ చేసింది. సమాచార శాఖలో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ షిప్ అధికారులు -6, ఆర్థిక గణాంక శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు - 29, వైద్య ఆరోగ్య శాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారి - 1, బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో హాస్టల్ వార్డెన్ -02 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు.

నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. నోటిఫికేషన్​లోని పూర్తి వివరాల కోసం ఎపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్​ను సందర్శించాలని వెల్లడించారు. ఏపీ పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఇదీ చదవండి

high court: డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా సీట్ల భర్తీపై హైకోర్టు స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.