ETV Bharat / city

గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని కొందరు.. వద్దని ఇంకొందరు.. ఎందుకు? - APPSC latest news

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్దులు పరీక్షలు నిర్వహించాలని భావిస్తుంటే.. ఏపీపీఎస్సీ తప్పిదాల కారణంగా వివిధ సందర్భాల్లో అవకాశాలు కోల్పోయిన అభ్యర్దులు మాత్రం కోర్టు తీర్పు వచ్చాకే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కోరుకుంటున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అనువాదం తప్పులపై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నప్పటికీ ఈ ఏడాది నవంబరు 2వ తేదీ నుంచి 13 వరకూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధం అవుతోంది.

APPSC Group-1 Exams Tension in Applied Candidates
గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని కొందరు.. వద్దని ఇంకొందరు.. ఎందుకు..?
author img

By

Published : Oct 10, 2020, 6:16 PM IST

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై ఇంకా అయోమయం కొనసాగుతోంది. ఈ ఏడాది నవంబరు 2 నుంచి 13 వరకూ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ షెడ్యూలు నిర్ణయించినప్పటికీ.. ప్రిలిమ్స్ పరీక్షలో అనువాదం తప్పులు, తుది సమాధానపత్రంలో తప్పులు దొర్లిన అంశంపై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చేంత వరకూ మెయిన్స్ పరీక్ష నిర్వహించొద్దని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీపీఎస్సీకీ.. దీనికి సంబంధించిన విజ్ఞాపన పత్రాలను కూడా అభ్యర్ధులు ఇవ్వడంతో ఏం చేయాలన్న దానిపై ఏపీపీఎస్సీ మల్లగుల్లాలు పడుతోంది.

ఇప్పటికే పరీక్షకు సిద్ధమైన కొందరు అభ్యర్ధులు మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని కోరుతున్నారు. అయితే గతంలో ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో దరఖాస్తులు చేసుకుని పరీక్షలు రాసిన అభ్యర్ధులు కోర్టు తీర్పుల కారణంగా అవకాశాలు కోల్పోవటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. 2011 గ్రూప్-1 నోటిఫికేషన్ విషయంలో కోర్టు తీర్పుల కారణంగా రెండుసార్లు మెయిన్స్ పరీక్షలను, ఇంటర్వూలను నిర్వహించారు. ఆ సమయంలో కొందరు అభ్యర్ధులు అవకాశాలను కోల్పోయారు. మెయిన్స్ పరీక్షకు ఇప్పుడు గడువు ఇవ్వాలని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టులో కేసు తేలిన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్ధుల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్.

వాస్తవానికి 2019 నోటిఫికేషన్​కు సంబంధించి ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి అయ్యింది. నవంబరు 1వ తేదీన ఇచ్చిన ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని, అనువాదం సరిగా లేకపోవటంతో సమాధానంగా గుర్తించేందుకు అవకాశం లేకుండా ఏపీపీఎస్సీ ప్రశ్నలు సంధించిందని అభ్యర్ధులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా 15కు పైగా తప్పులు ప్రిలిమ్స్ కీలో తేలినట్టు గ్రూప్-1 మెయిన్స్ కు సిద్ధం అవుతున్న అభ్యర్ధులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై హైకోర్టు నుంచి తీర్పు రాకుండా మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తే మళ్లీ 2011 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.