రాష్ట్రంలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు తక్షణం జీతాలు చెల్లించాలని ఏపీ ఉద్యోగుల ఐకాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఐకాస సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు.
అయినా చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందని అందులో పేర్కోన్నారు. మరోవైపు ఆగస్ట్ నెలాఖరుతో గడువు ముగిసిన ఉద్యోగులకు కాంట్రాక్ట్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ఐకాస కోరింది. శాఖల వారీ జస్టిఫికేషన్ పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను నిలుపుదల చేసే విధంగా రిపోర్టులు కోరడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాల ఐకాస... సీఎస్ కు విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: