కరోన మహమ్మారి ప్రబలుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని రాష్ట్ర ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. ఉద్యోగుల జీతాలు 2 విడతలుగా ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఉద్యోగుల పక్షాన ఇబ్బంది ఉంటే తప్ప వాయిదా వేయొద్దని సీఎంను కోరామన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా జీతాలు 50 శాతం చెల్లిస్తామన్నారని తెలిపారు.
తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు పూర్తి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒక్క రోజు నిరాహారదీక్ష చేయటం హాస్యాస్పదమని వెంకటేశ్వర్లు విమర్శించారు. ఉద్యోగులను అడ్డంగా పెట్టుకుని పదవి సంపాదించిన వ్యక్తి అశోక్ బాబు అని ఆరోపించారు. అశోక్ బాబు నిరాహారదీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నప్పుడు చేయని దీక్షలు ఇప్పుడెందుకు గుర్తువచ్చాయని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: