ETV Bharat / city

AP TOPNEWS ప్రధానవార్తలు@7am - ap latest news

.

7am topnews
ప్రధానవార్తలు7am
author img

By

Published : Oct 10, 2022, 6:59 AM IST

  • పండగ తర్వాత సొంతూళ్లకు తిరుగు పయనం..

దసరా పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు పయనమయ్యారు. వారాంతం కావడం,.. రేపట్నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో కుటుంబాలతో సహా తిరుగు పయనమయ్యారు. వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిశాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జల దిగ్బంధంలో శ్రీకాకుళం...

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 3 రోజులుగా జోరువానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. నదుల ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నీటమునిగి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "అవినీతిపై దృష్టి మళ్లించేందుకే... మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల దుష్ప్రచారం"

అవినీతిపై దృష్టి మళ్లించేందుకే మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు.. అమరావతిపైనా, రైతుల పాదయాత్రపైనా దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. విజయసాయిరెడ్డి సహా ఇతర వైకాపా నేతలు.. విశాఖలో భూములు దోచుకున్నది వాస్తవం కాదా అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ నిలదీశారు. ఆ అవినీతి ఉత్తరాంధ్ర మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జోరువాననూ లెక్క చేయకుండా.. లక్ష్యం వైపే నడక

అమరావతి రైతుల మహాపాదయాత్ర 28వ రోజూ కదనోత్సాహంతో సాగింది. జోరువాననూ లెక్కచేయక రైతులు... లక్ష్యంవైపు నడక సాగించారు. స్థానికులు, వివిధ ప్రజాసంఘాలు, విపక్ష నాయకులు ఎక్కడికక్కడ ఎదురెళ్లి కర్షకులను స్వాగతించారు. వారిపై పూల వర్షం కురిపిస్తూ.. కలిసి అడుగులు వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వీఐపీ మందుబాబుల కోసం సర్కారీ గెస్ట్ హౌస్​లు.. ఏసీలు, బెడ్​లు..

రోడ్లపై మద్యం తాగి ఎటు పోలేని స్థితిలో ఉన్న బడాబాబుల సౌకర్యార్థం.. బిహార్‌ అబ్కారీ శాఖ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. వారి కోసం ఏకంగా ప్రత్యేక సౌకర్యాలతో కూడిన వార్డులను సిద్ధం చేసింది. రోడ్లపై తాగి తిరిగే వారిని అతిథుల మాదిరిగా సపర్యలు చేయడానికి సమస్తిపుర్‌ అబ్కారీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చెరువులో స్నానానికి దిగి.. ఆరుగురు చిన్నారులు మృతి

హరియాణాలో ఘోరం జరిగింది. స్నానానికి వెళ్లిన ఆరుగురు చిన్నారులు చెరువులో మునిగి మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు.. చిన్నారుల మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'తైవాన్​ను చైనాకు అప్పగించండి!'.. మస్క్ మరో శాంతి మంత్రం..

ఇటీవలే రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళికతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరోసారి వివాదాస్పద ప్రతిపాదన చేశారు. చైనా-తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధం దిశగా సాగుతున్న వేళ.. మస్క్‌ మరో శాంతి ప్రణాళిక ప్రతిపాదించారు. మస్క్‌ ప్రతిపాదనపై తైవాన్‌ భగ్గుమనగా.. ఎలాన్‌ గీత దాటారంటూ చైనా విమర్శించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాట్సాప్​లో బ్యాంకింగ్​ సేవలు కావాలా?.. ఇలా రిజిస్టర్​ చేసుకోండి!

సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల ఎస్​బీఐతో పాటు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి అన్ని ప్రధాన బ్యాంకులు పలు సేవలను డిజిటల్‌ విధానంలో అందుబాటులో ఉంచుతున్నాయి. తమ ఖాతాదారులకు 'వాట్సాప్‌ బ్యాంకింగ్‌' సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే వాట్సాప్‌ సేవలకు ఎలా రిజిస్ట‌ర్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సాకర్‌' సమరానికి సై.. 20 రోజుల పాటు అభిమానులకు కిక్కే కిక్కు!

భారత్‌లో మళ్లీ సాకర్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. ఫిఫా అండర్‌-17 అమ్మాయిల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం ఫుట్‌బాల్‌ సంబరాలకు తెరలేవనుంది. ఉరకలెత్తే రక్తంతో.. మైదానంలో గోల్స్‌ వేటలో సాగే టీనేజీ అమ్మాయిల ఆటను వీక్షించడమే ఇక తరువాయి. 20 రోజుల పాటు అభిమానులకు కిక్కే కిక్కు. 30న నవీ ముంబయిలో ఫైనల్‌ జరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పండగ జోరు.. చూపించేదెవరు?.. అందరి దృష్టి సంక్రాంతిపైనే!

దసరా సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరోపక్క దీపావళి చిత్రాలూ శరవేగంగా ముస్తాబవుతున్నాయి. ఇక పరిశ్రమ దృష్టంతా సంక్రాంతి సందడిపైనే ఉంది. కొన్ని నెలల కిందటి వరకూ ఈ పెద్ద పండగ రేసులో బోలెడు ప్రాజెక్టులు ఉండేవి. వాటిలో కొన్ని ఒకొక్కటిగా వెనక్కి తగ్గుతూ వచ్చాయి. ఓ సారి ఆ వివరాలు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.