ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు @11am

.

11am top news
ఏపీ ప్రధానవార్తలు @11am
author img

By

Published : Sep 8, 2022, 10:58 AM IST

  • దసపల్లా భూములు ప్రైవేటుపరం?

విశాఖలో అత్యంత విలువైన దసపల్లా భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. గత కొద్దినెలలుగా ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా దస్త్రాలు కదిలాయి. అధికార యంత్రాంగం కూడా వంతపాడింది. రూ.2వేల కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు దస్త్రం సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రాణాల మీదకు తెచ్చిన బాల్యవివాహం.. ఏడో తరగతిలోనే పెళ్లి..

ఏడో తరగతి చదువుతున్న బాలికకు 30 ఏళ్లు దాటిన వ్యక్తితో వివాహం జరిపించగా... శారీరక వికాసం లేని ఆమె గర్భవతై శిశువుతో పాటు తనూ చనిపోయింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్ర, రాష్ట్రాల్లో ప్రశ్నించే ప్రతిపక్షాలు కావాలి

కేంద్రంలో శక్తిమంతమైన, సమర్థుడైన ప్రధాని ఉన్నారని, స్థిరమైన ప్రభుత్వం ఉందని.. దానికి తగ్గట్లుగా సమర్థమైన ప్రతిపక్షం ఉండాలని తాను భావిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ రెండుచోట్లా ప్రశ్నించే ప్రతిపక్షాలు కావాలన్నారు. ‘ప్రశ్నించడానికి కావాల్సిన నైతిక శక్తి ఉన్న ప్రతిపక్షం కావాలంటూ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పరీక్ష బాగా రాయలేదని.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

‘అమ్మా, నాన్నా.. మీరు ఆశించిన స్థాయిలో చదవలేకపోతున్నా. జీవితం గురించి ఎన్నో కలలు కన్నా. ఆ లక్ష్యాన్ని చేరుకోలేనని భావించి.. శాశ్వతంగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నా. నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చదివించండి’ అని లేఖ రాసి శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న విద్యార్థిని (17) ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- జపాన్​లో లక్షపైనే!

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,395 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మృతుల సంఖ్య 33గా నమోదైంది. ఒక్కరోజులో 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7కు పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.11 శాతానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గల్ఫ్​ మోసానికి చెక్.. ఒమన్‌లో చిక్కుకున్న నిరుపేద యువతిని కాపాడిన భజ్జీ

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్.. గల్ప్​ మోసగాళ్ల చెర నుంచి ఓ నిరుపేద యువతిని కాపాడారు. ఎంబసీ అధికారులను సాయంతో ఆమె సురక్షితంగా భారత్​కు చేరుకుంది. దీంతో హర్భజన్​పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పార్లర్‌లో అగ్ని ప్రమాదం- 32 మంది మృతి

దక్షిణ వియత్నాంలోని కరోకే పార్లర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 32 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటలకు బిన్‌ డుయోంగ్‌ ప్రావిన్స్‌లోని థువాన్‌లో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న పార్లర్‌లో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బల్లెం వీరుడు నీరజ్ చోప్రా​ మరోసారి చరిత్ర సృష్టిస్తాడా?

భారత జావెలిన్‌ త్రో స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా మరో చరిత్ర ముంగిట నిలిచాడు. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో గురువారం ఆరంభమయ్యే ఈ పోటీల్లో బరిలో దిగుతున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రణ్​బీర్​, అలియా​కు నిరసన సెగ.. ఆలయంలోకి వెళ్లకుండా..

త్వరలో విడుదలవ్వనున్న బ్రహ్మాస్త్ర మూవీకి బాయ్​కాట్​ సెగ గట్టిగానే తగులుతోంది. ఈ సారి వారిని బజరంగ్​ దళ్​రూపంలో అడ్డుకుంది. ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయంలోకి రణ్​బీర్​ అలియాను వెళ్లకుండా అడ్డుకుని నిరసన తెలిపారు బజరంగ్​ దళ్​ కార్యకర్తలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.