ETV Bharat / city

ప్రధానవార్తలు @7AM - టాప్​ న్యూస్​

.

ప్రధానవార్తలు @7AM
7AM TOPNEWS
author img

By

Published : Jul 27, 2022, 6:59 AM IST

  • 'కేంద్ర సంస్థల ఏర్పాటులో వేగం పెంచండి.. ఏపీ ప్రభుత్వశాఖలతో చర్చించండి'

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ మూర్తి, ఇతర అధికారులు హాజరై ఆయా సంస్థల పురోగతిని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుప్రీం వద్దన్నచోటా అంతస్తులు.. ఇదీ 'వైజాగ్​ రుషికొండ' వద్ద పనుల తీరు!

విశాఖ తీరంలోని రుషికొండ ప్రాజెక్టువద్ద సుప్రీంకోర్టు వద్దన్నచోటా.. రేయింబవళ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మొదటి అంతస్తు సెంట్రింగ్‌ వరకు వచ్చాయి. పని ప్రదేశంలో సిబ్బంది ఎక్కువగానే కనిపిస్తున్నారు. రుషికొండ వద్ద కొత్తగా తవ్వినచోట ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని జూన్‌ 1న సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు విరుద్ధంగా గీతం విశ్వవిద్యాలయానికి ఎదురుగా పనులు చేపట్టడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీపీఎస్‌ రద్దు హామీ కొండెక్కినట్లేనా?.. వాటా పేరుతో సర్కార్​ కొత్త అప్పు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సీపీఎస్​ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా కొండెక్కించినట్లేనా అన్న అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఎస్‌ కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి కొత్త రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి పొందింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి మంగళవారం రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీల రుణాల రాయితీ వెనక్కి!.. బ్యాంకుల్లో రూ.488 కోట్లకుపైనే..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు గత మూడేళ్లుగా స్వయం ఉపాధి రుణాలివ్వని వైకాపా ప్రభుత్వం.. గత ప్రభుత్వమిచ్చిన రాయితీ నిధుల్నీ విడిచిపెట్టడం లేదు. తాజాగా గత ప్రభుత్వ హయాంలో పేదల అభ్యున్నతికి 20 కార్పొరేషన్ల ద్వారా అందించి.. ఖర్చు కాకుండా మిగిలిపోయిన స్వయం ఉపాధి రుణాల రాయితీ నిధులపై కన్నేసింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఖర్చు కాకుండా ఉన్న నిధులు బ్యాంకుల్లో సుమారు రూ.488 కోట్లు ఉన్నట్లు గుర్తించి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఉచిత హామీలు తీవ్రమైన అంశం.. వాటిపై ఓ వైఖరి తీసుకోరెందుకు?'

ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే అసంబద్ధమైన ఉచిత హామీలు తీవ్రమైనవని.. ఈ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోంది? దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఒక్క రూపాయి డాక్టర్‌' కన్నుమూత.. మోదీ, దీదీ సంతాపం

ప్రజలకు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన వైద్యుడు సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ కన్నుమూశారు. రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనా దారిలోనే రష్యా... అంతరిక్ష కేంద్రానికి గుడ్​బై!

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 సంవత్సరం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించింది. సొంతంగా ఆర్బిటింగ్​​ అవుట్​ పోస్టును నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ అధిపతి యూరి బోరిసోవ్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 5జీ స్పెక్ట్రమ్​ వేలం.. తొలిరోజే సూపర్ రెస్పాన్స్.. టెల్కోలతో పాటు అదానీ కూడా!

5జీ స్పెక్ట్రమ్​ కేటాయింపులు ఆగస్టు 14లోపు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్​. ఈ ఏడాది చివరికల్లా అనేక నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు తొలిరోజు స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. మరోవైపు, బుధవారం కూడా వేలం కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫామ్​లో లేకపోయినా అగ్రస్థానంలో కోహ్లీ.. ఇదెలా సాధ్యం?

కోహ్లీని జట్టు నుంచి తప్పించాలి? ఫామ్‌లో లేడు.. మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయలేదు.. అతడిని ఆడించడం అనవసరం.. ఇలా కొద్దిరోజులుగా విరాట్​పై ఎన్నో విమర్శలు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. ఈ విమర్శలకు అతడు పరోక్షంగా కాస్త గట్టిగానే సమాధానమిచ్చాడు. అదీ కూడా పరుగులు చేసి. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అదెలా అంటే... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ టీవీ స్టార్​ సిల్వర్​స్క్రీన్​ పీస్​.. ఈమె ట్రెండీ లుక్స్​ చూస్తే..

ఈటీవీలో ప్రసారమయ్యే 'మనసంతా నువ్వే' సీరియల్​లోని సింధు పాత్రతో.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కేరళ కుట్టి వింధుజ విక్రమ్​. తన నటనతో అతి కొద్ది రోజుల్లోనే ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ఓ సారి ఈ ముద్దుగుమ్మ క్యూట్​ లుక్స్​ను చూసేద్దాం.. అలానే ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.