- .శ్రీలంకను చూసైనా జాగ్రత్త పడండి.. ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..
ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. ఆర్థికశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీబీఐకి ఎందుకు అప్పగించకూడదు..మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న కేసులపై హైకోర్టు ప్రశ్న..
గత ఏప్రిల్ నెలలో నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆధారాలు చోరీకి గురైన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వ్యవహారంపై వాదనలు ముగిశాయి. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్ రెడ్డి, తదితరులపై పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CROP DAMAGE: కోనసీమలో గోదారమ్మ ఉగ్రరూపం.. పంటలు వరదార్పణం..
భారీ వరదతో విరుచుకుపడి..ముంచెంత్తిన గోదావరి..క్రమంగా తగ్గుతున్నా.. ఇంకా లంకలు ముంపులోనే మగ్గిపోతున్నాయి. ఉద్ధృతి కాస్త తగ్గినా..తీరంలో ఇంకా వరద కొనసాగుతూనేఉంది. వరద బీభత్సంతో పంటలన్నీ మునిగిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో..లక్షల్లో పెట్టుబడి వరదార్పణం అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- (Murder)పల్నాడులో దారుణం.. ఆస్తి కోసం అక్కను చంపిన ముగ్గురు సోదరులు..
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం తోడబుట్టిన అక్కను ముగ్గురు సోదరులు కలిసి దాడి చేశారు. ఈ దాడిలో వారి అక్క మృతి చెందింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లోనూ శ్రీలంక పరిస్థితులు?.. జైశంకర్ క్లారిటీ..
శ్రీలంకలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు భారత్‌లోనూ ఏర్పడే అవకాశం ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో సరిపడా నిధులు ఉన్నాయని.. అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశమే లేదని స్పష్టం చేశారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రైల్వే మెలిక.. సర్వీస్ ఛార్జ్ తొలగించి.. అసలు ధరకు కలిపేసి..
ప్రీమియం రైళ్లలో సరఫరా చేసే ఆహార పదార్థాలపై సర్వీస్ ఛార్జీని రద్దు చేస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. అయితే, రద్దు చేసిన సర్వీస్ ఛార్జీని.. ఆహార పదార్థాల ధరల్లో కలిపేసి ప్రయాణికులకు మెలిక పెట్టింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పుష్ప 2'.. సేతుపతి వర్సెస్ మనోజ్ బాజ్‌పాయ్.. అవకాశం దక్కెదెవరికో?
ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ నటించనున్న కొత్త చిత్రం 'పుష్ప 2'లోని ఓ పాత్ర కోసం విజయ్‌సేతుపతి, మనోజ్బాజ్పాయ్ను దర్శకుడు సుకుమార్ సంప్రదించినట్లు తెలిసింది. మరి ఈ రోల్ ఎవరు చేస్తారో?. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోహ్లీతో ఆడితేనే ఆ విషయం అర్థమవుతుంది: స్టోక్స్..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్‌స్టోక్స్. విరాట్ లాంటి ఆటగాడితో ఆడితేనే టాప్ లెవెల్ ఆటంటే ఏంటో అర్థమవుతుంది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుల వాహన ఎగుమతుల్లో 26% వృద్ధి..
ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్‌లో మన దేశం నుంచి 1,60,263 ప్రయాణికుల వాహనాలు ఎగుమతి అయ్యాయి. 2021 ఇదే త్రైమాసికంలో ఎగుమతి అయిన 1,27,083 వాహనాలతో పోలిస్తే ఈసారి 26 శాతం ఎక్కువగా జరిగాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్) తెలిపింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంకకు కొత్త నాయకత్వం.. బుధవారం అధ్యక్షుడి ఎన్నిక..
గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు కొత్త నాయకత్వం రాబోతోంది. దేశ నూతన అధ్యక్షుడు, ప్రధానమంత్రిని బుధవారం ఎన్నుకోనున్నారు. అధ్యక్షుడిగా దులస్ అలహాప్పెరుమాకు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.