ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM - ఏపీ తాజావార్తలు

..

topnews
topnews
author img

By

Published : Jul 5, 2022, 12:59 PM IST

  • దురుద్దేశంతోనే నాపై కేసులు పెట్టారు.. హైకోర్టులో ఏబీవీ వ్యాజ్యం

ABV PIL: నిఘా అధిపతిగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఏపీ విజిలెన్స్‌ కమిషన్‌ ఆమోదం పొందకుండా సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారన్నారు. తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసును రద్దు చేయాలని కోరారు.

  • WONDER KID: సకలకళా ‘తపస్వి’!

WONDER KID: కరాటే, చిత్రలేఖనం, ఉపన్యాసం, అభినయం.. ఇలా పలు రంగాల్లో తన ప్రతిభ చాటుతున్నాడు ఓ బుడత. చిరుప్రాయంలోనే ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సాధించాడు. తనతోటి వారికి ఆదర్శంగానూ నిలుస్తున్నాడు. మరి ఆ చిన్నారి గురించి తెలుసుకుందామా.. అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.

  • చిరుత అనుమానాస్పద మృతి.. విచారణ చేపట్టిన అధికారులు

కర్నూలు జిల్లాలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రహదారి పక్కన పంటపొల్లాలో చిరుత కళేబరాన్ని గుర్తించిన గ్రామస్థులు.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత మృతదేహాన్ని ఆదోని అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు.

  • తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 13వేల మందికి వైరస్

Covid Cases In India: భారత్​లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారంతో పోలిస్తే కొత్త కేసులు మూడు వేలు తక్కువగా నమోదయ్యాయి. 19మంది చనిపోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు తగ్గింది. కొవిడ్​ నుంచి 12,456 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతం వద్ద స్థిరంగా ఉంది.

  • 'ఆసుపత్రికి వెళ్లా- ప్రియుడితో పారిపోలేదు'.. మహిళ హైడ్రామా.. మాజీ భర్తతో వాగ్వాదం!

ప్రియుడి మోజులో భర్తను వదిలేసి వెళ్లిపోయిన మహిళ.. తన పిల్లల కోసం తిరిగి వచ్చింది. అయితే, తాను ప్రియుడితో పారిపోలేదని మహిళ చెబుతోంది. ఈ క్రమంలో పిల్లల విషయమై భర్తతో వాగ్వాదానికి దిగింది.

  • దంచికొట్టిన వానలు.. రైల్వేస్టేషన్ జలమయం.. మోకాళ్ల లోతు వరకు నీళ్లే!

heavy rains in Mumbai: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించిన నేపథ్యంలో.. వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ముంబయిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓ రైల్వేస్టేషన్​లోకి నీరు చేరడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • డాన్​బాస్​ను చేజిక్కించుకున్న రష్యా.. అంతరిక్షంలో సంబరాలు

Russia Ukraine war: గత కొన్ని నెలలుగా రష్యా-ఉక్రెయిన్​ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్​లోని లుహాన్స్క్‌ కూడా రష్యా బలగాల చేజిక్కిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. డాన్‌బాస్‌ ప్రాంతంలోని కీలక ప్రాతాలన్నింటిపైనా తాము పట్టు సాధించామని తెలిపారు.

  • కార్యాలయ స్థలాల లీజింగ్​లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌

OFFICE SPACE LEASE HYD: కార్యాలయ స్థలాల లీజింగ్​లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 23 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని వివిధ కార్పొరేట్ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2021 నాటి లెక్కలతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం కావడం విశేషం.

  • బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. కపిల్​, కుంబ్లే సరసన చోటు

IND VS ENG Bumra record: టీమ్​ఇండియా, ఇంగ్లాండ్​ టీమ్స్​ మధ్య జరుగుతున్న ఐదో మ్యాచ్​లో భారత పేసర్​ బుమ్రా మరో సూపర్​ రికార్డును సాధించాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపై అక్కడి మైదానాల్లో వంద వికెట్లకుపైగా సాధించిన ఆరో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

  • లవ్​ ఫెయిల్యూర్​.. క్యాన్సర్​.. 700కుపైగా ఆడిషన్స్​.. కానీ ఆ ఒక్క ఛాన్స్!

Anveshi Jain Na peru Seesa song: 'ఊ అంటావా మావా' పాటతో సమంత యూత్​ను కట్టిపడేసింది హీరోయిన్​ సమంత. అయితే ఇప్పుడు 'నా పేరు సీసా'తో అన్వేషి జైన్‌ కూడా అదే చేసింది. 'సీకాకుళం సారంగి'గా తన అందాన్ని ఆరబోస్తూ.. చిందులేస్తూ యువతను ఉర్రూతలూగిస్తోంది. వారికి కునుకు లేకుండా చేస్తోంది. దీంతో కూర్రాళ్లంతా ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.