- వరద బాధితుల్ని వదిలేశారు..
గోదావరి భారీ వరద నేపథ్యంలో పోలవరం విలీన మండలాల్లో యంత్రాంగం అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వరద తీవ్రత గురించి అధికారులు తెలియజేయలేదు. పునరావాస కాలనీలు నిండిపోయాయని, తమకు అక్కడ చోటులేకే సొంతంగా గుడిసెలు వేసుకుంటున్నామని పేద నిర్వాసితులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Floods: శాంతించని గోదావరి.. వరదల్లోనే మగ్గుతున్న లంక గ్రామాలు..
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా.. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. ఎగువన వర్షాలు, వరద ప్రవాహంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చదువిక్కడ.. కొలువెక్కడో.. డిగ్రీ పట్టాలతో తరలిపోతున్న యువత..
495 మందికి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు లభించగా.. మరో 30 మంది ఎంబీఏ, ఎంటెక్‌కు వెళ్లారు. 11 మంది విదేశాల్లో ఎంఎస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉద్యోగాలు పొందిన 495 మంది టీసీఎస్, విప్రో, డీఎక్స్‌సీ, యాక్సెంచర్, క్యాప్‌జెమినీలాంటి కంపెనీలకు ఎంపికయ్యారు. వీరందరూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనే ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. 192 మందికి ఎలాంటి ఉద్యోగాలూ లభించలేదు. ఈ లెక్కన స్థానికంగా ఉపాధి పొందిన వారు ఒక్కరూ లేరు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ ఇదే తీరు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరునే కొనసాగించాలి-జై భీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్..
అంబేడ్కర్ విదేశీ విద్య పథకానికి సీఎం పేరు పెట్టుకోవడాన్ని జై భీమ్ పార్టీ నిరసించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులను మోసం చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- హడావుడిగా పాక్‌లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్‌కు వస్తుండగా!..
షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకనటలో తెలిపింది. ప్రయాణికుల్ని హైదరాబాద్ రప్పించేందుకు మరో విమానాన్ని పంపుతున్నట్లు పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దేశంలో తగ్గని కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?..
భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,528 మంది వైరస్ బారిన పడగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తెలుగు సినిమా నిర్మాతల సంచలన నిర్ణయం?..
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, హీరోహీరోయిన్లు పారితోషికాలు పెంచడం.. తమకూ కనీస వేతనాలు పెంచాలంటూ జూనియర్ ఆర్టిస్ట్‌లు సమ్మెకు దిగడం మొదలైన కారణాల వల్ల భవిష్యత్తులో సినిమాల నిర్మాణంపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇక రెండున్నర నెలలు సందడే సందడి!..
ICC FTP 2023 to 2027: ఐపీఎల్ కోసం ఎఫ్టీపీ క్యాలెండర్లో రెండున్నర నెలలను ఐసీసీ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రోజులు కేటాయించడంపై బీసీసీఐకి ఇప్పటికే అనేక దేశాల మద్దతు లభించింది. విదేశీ ఆటగాళ్లు చాలా మంది ఐపీఎల్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో ఆర్జిస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'పెరుగుతున్న గిరాకీ.. ఎంఎన్సీల చూపు భారత్ వైపు.. 2030 నాటికి అలా..'
భారత్‌లో ఫార్మాస్యూటికల్ మార్కెట్ రాబోయే దశాబ్దంలో దూసుకెళ్తుందని అన్నారు పరాక్సెల్ ఇంటర్నేషనల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ వ్యాస్. ప్రస్తుతం 44 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్ 2030 నాటికి 130 డాలర్లుకు చేరుకుంటుందని తెలిపారు. దీని వల్ల దేశీయంగా కాంట్రాక్టు పరిశోధనా సేవలకు గిరాకీ ఎంతగానో పెరుగుతుందని వెల్లడించారు. పరాక్సెల్ ఎండీ సంజయ్ వ్యాస్ 'ఈనాడు'తో పలు విషయాలు ముచ్చటించారు. వాటి గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రోజులో మనిషి పీల్చుకునే ఆక్సిజన్ ఎంతో తెలుసా?..
మీరు రోజూ ఎంత గాలి పీల్చుకుంటున్నారో, రోజుకు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో ఎప్పుడైనా లెక్కించారా? ఆరోగ్యవంతులైన వారు నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం శ్వాస సంబంధిత రోగులపై అధికంగా ఉన్న వేళ మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి